CCL: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్ళీ వచ్చేసింది.. ప్రాక్టీస్ లో బిజీ అవుతున్న సినిమా తారలు.. డేట్ ఫిక్స్!

ఇండియాలో అత్యధికంగా ఆదరణ కలిగిన క్రికెట్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమా లవర్స్ కూడా ఇండియాలో చాలా ఎక్కువగానే ఉన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే ఈ రెండు రంగాల్లో ఉండే వారికి మన దేశంలో భారీ స్థాయిలో క్రేజ్ అందుతూ ఉంటుంది. ఇక రెండు మిక్స్ అయితే వారిపై అంచనాలు మరింతగా పెరిగిపోతూ ఉంటాయి. ఇక గతంలో చాలామంది సినిమా స్టార్స్ క్రికెట్ లీగ్స్ లో ఆడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి సెలబ్రెటీ క్రికెట్ లీగ్ కూడా మొదలు కాబోతోంది.

ఈ ఆట కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఎనిమిది సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన సినిమా తారలు కూడా అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు కన్నడ మలయాళం భోజ్పూరి బాలీవుడ్ హాలీవుడ్ తో సినీ తారలతో పాటు పంజాబ్ అలాగే బెంగాల్ కు సంబంధించిన సినిమా తారలు కూడా వారి టీమ్స్ తో రెడీ అవుతున్నారు. మొత్తం ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో 8 టీమ్ లో పాల్గొనబోతున్నాయి.

Celebrity cricket league is back with film stars and launch date details

ఇక ముఖ్యంగా తెలుగులో నుంచి ప్రముఖ స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. అఖిల్ అక్కినేని తో పాటు సాయి ధరమ్ తేజ్ తరుణ్ అలాగే మరి కొంతమంది స్టార్స్ ప్రతిసారి హైలైట్ అవుతూ వస్తున్నారు. ఇక ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్ బెంగాల్ టైగర్స్ కర్ణాటక బుల్డోజర్స్ మధ్యలో జరగనుంది. ఇక తెలుగు వారియర్స్ కేరళ స్ట్రైకర్స్ తో ఫిబ్రవరి 19వ తేదీన మొదటి మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో రెండు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపులో నాలుగు టీమ్స్ ఉంటాయి. ఒక్కోటి మిగిలిన టీం సభ్యులతో ఒక మ్యాచ్ ఆడుతుంది. ఇక గ్రూపులో టాప్ లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు వెళ్తాయి. ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మార్చి 19వ తేదీన జరగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X