twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిరాశ పరిచిన వెంకీ.. సీసీఎల్‌ మ్యాచ్ హైలెట్స్ (ఫోటోస్)

    By Srikanya
    |

    బెంగళూరు: సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) పోటీల్లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో తెలుగు వారియర్స్‌- కేరళ స్త్ట్రెకర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌- బెంగాల్‌ టైగర్స్‌ నడుమ మ్యాచ్‌లు జరిగాయి. పూల్‌ 'ఎ'లో కర్ణాటక బుల్డోజర్స్‌, కేరళ స్త్ట్రెకర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్‌, ముంబయి హీరోస్‌ జట్లున్నాయి. పూల్‌ 'బి'లో తెలుగు వారియర్స్‌, వీర్‌ మరాఠీ, చెన్నై రైనోస్‌, బెంగాల్‌ టైగర్స్‌ ఉన్నాయి.

    అజాగ్రత్తగా బౌలింగ్‌ అనర్థాలకు దారితీస్తుందేనేందుకు ఆదివారం బెంగళూరులో జరిగిన సీసీఎల్‌-4 లీగ్‌ పోటీ సాక్ష్యం. తెలుగు వారియర్స్‌, కేరళ స్త్ట్రెకర్స్‌ నడుమ విజయావకాశాల్ని ఎక్స్‌ట్రాలే నిర్ధారించాయి. తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్న వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగుల్ని సాధించింది.

    స్త్ట్రెకర్స్‌ బౌలర్లు ఐదు ఎక్స్‌ట్రా పరుగులిచ్చారు. వారియర్స్‌ బౌలర్లు ఏకంగా 27 ఎక్స్‌ట్రా పరుగులిచ్చారు. ఫలితం..... విజయాన్ని స్త్ట్రెకర్స్‌ సాధించారు. ఇందులో మూడు బైస్‌, నాలుగు లెగ్‌బైస్‌, 20 వైడ్స్‌. వారియర్స్‌ బౌలర్లు కాస్తంత జాగ్రత్తగా ఎక్స్‌ట్రాల్ని తగ్గించిన పక్షంలో సునాయాస గెలుపు సాధ్యమయ్యేది.

    మిగతా విశేషాలు..స్లైడ్ షోలో..

    టాస్ గెలిచి...

    టాస్ గెలిచి...

    మధ్యాహ్నం 3.10 గంటలకు టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన వెంకటేష్‌ బ్యాటింగ్‌ను ఎంచుకున్నారు. తారకరత్నతో కలిసి బ్యాటింగ్‌ను ఆరంభించారు.

    తడబాటుతో మొదలెట్టి...

    తడబాటుతో మొదలెట్టి...

    టాస్‌ గెలిచిన తెలుగు వారియర్స్‌ సారథి వెంకటేష్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. వారియర్స్‌ తొలుత తడబాటుగా ఆటను ఆరంభించినా క్రమేపీ పుంజుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగుల్ని సాధించారు.

    ఓపెనెర్స్ గా...

    ఓపెనెర్స్ గా...

    వారియర్స్‌లో తారకరత్న, వెంకటేష్‌ ఓపెనర్స్‌గా వెళ్లారు. వెంకటేష్‌ రెండు బంతుల్లో నాలుగు పరుగుల్ని సాధించి రనౌట్‌ కావడంతో వారియర్స్‌లో కొంత నిరుత్సాహాన్ని కల్గించింది. వెంకటేష్‌ స్థానంలో బరిలోకి వచ్చిన సచిన్‌ జోషి ఐదు బంతుల్లో ఐదు పరుగుల్ని సాధించి రాజీవ్‌ పిళ్త్లె బౌలింగ్‌లో బౌల్డ్‌ ఆయ్యారు.

    ప్రిన్స్ బౌండరీలు..

    ప్రిన్స్ బౌండరీలు..

    అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ప్రిన్స్‌ 20 బంతుల్లో 20 పరుగుల్ని సాధించారు. ఇందులో మూడు బౌండరీలున్నాయి. బంతి బౌండరీకి చేరినప్పుడు ప్రేక్షకులు హర్షధ్వానాలు మిన్నంటాయి.

    అఖిల్ సిక్సర్ తో..

    అఖిల్ సిక్సర్ తో..

    అఖిల్‌ బరిలోకి దిగినప్పుడు స్టేడియం చప్పట్లతో మార్మోగింది.అఖిల్‌ అక్కినేని 14 బంతుల్లో 22 పరుగుల్ని సాధించారు. ఇందులో రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. రాజ్‌కుమార్‌ రెండు బంతుల్లో నాలుగు పరుగుల్ని సాధించి కొడియెరి బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యారు. ఆదర్శ్‌ 31 బంతుల్లో 38 పరుగుల్ని సాధించి నాటౌట్‌గా నిలిచారు. ఇందులో ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ ఉన్నాయి.

    నాటౌట్...

    నాటౌట్...

    సుధీర్‌ బాబు కూడా నాటౌట్‌గా నిలిచి 18 బంతుల్లో 26 పరుగుల్ని సాధించారు. ఇందులో ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ ఉన్నాయి.

    తారకరత్న...

    తారకరత్న...

    నందమూరి తారకరత్న.. 26 బంతుల్లో 20 పరుగుల్ని సాధించి రనౌట్‌ అయ్యారు. ఇందులో రెండు బౌండరీలున్నాయి.

    మొత్తం మీద..

    మొత్తం మీద..

    తెలుగు వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగుల్ని చేసింది. 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ స్త్ట్రెకర్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించి లీగ్‌లో బోణీ సెలవు రోజున విహార యాత్రలకు వెళ్లే ఔత్సాహికులు పర్యటనల్ని రద్దు చేసుకుని క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకే మొగ్గు చూపారు.

    పెద్ద సంఖ్యలో..

    పెద్ద సంఖ్యలో..

    ఎలక్ట్రానిక్‌ సిటీ, బొమ్మనహళ్లి, బీటీఎం లేఔట్‌ తదితర తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

    నిరాశ..

    నిరాశ..

    తొలి ఓవర్‌లో వారియర్స్‌కు కేవలం రెండు పరుగులు మాత్రమే లభించాయి. అవి కూడా ఎక్స్‌ట్రాలే కావడం గమనార్హం. రెండో ఓవర్‌లో పరుగు తీసే యత్నంలో వెంకటేష్‌ రనౌట్‌ కావడం అభిమానులకు నిరాశను మిగిల్చింది.

    వికెట్ల పతనమిలా....

    వికెట్ల పతనమిలా....

    2.2 ఓవర్లలో ఏడు పరుగుల వద్ద వెంకటేష్‌, 3.4 ఓవర్లలో 19 పరుగుల వద్ద సచిన్‌ జోషి, 8.4 ఓవర్లలో 46 పరుగుల వద్ద ప్రిన్స్‌, 10.1 ఓవర్లలో 58 పరుగుల వద్ద తారకరత్న, 13.1 ఓవర్లలో 80 పరుగుల వద్ద అఖిల్‌, 13.3 ఓవర్లలో 84 పరుగుల వద్ద రాజ్‌కుమార్‌ వికెట్‌ పతనమైంది. ఐదు ఎక్స్‌ట్రాలతో తెలుగు వారియర్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగుల్ని సాధించింది.

    చివరి బంతి వరకూ ఉత్కంఠ

    చివరి బంతి వరకూ ఉత్కంఠ

    నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ స్త్ట్రెకర్స్‌ తొలుత తడబడ్డా అనంతరం నిలదొక్కుకుంది. చివరి వరకు ఉత్కంఠత చోటుచేసుకుంది. ఒక దశలో తెలుగు వారియర్స్‌దే విజయంగా భావించినా చివరకు అంచనాలు తారుమారయ్యాయి. ఆదర్శ్‌ పడ్డ శ్రమ వృథా అయింది. వారియర్స్‌ బౌలర్‌ కీలక సమయంలో మూడు వికెట్లను తీసుకున్నా ఫలితం లేకపోయింది. కేరళ స్త్ట్రెకర్స్‌లో నందకుమార్‌-9 (ఎల్‌బిడబ్ల్యు), కొడియెరి- 41 (ఎల్‌బిడబ్ల్యు), ఎస్‌.నాయర్‌- 19 (రనౌట్‌), అరుణ్‌-16 (క్యాచ్‌), రాజీవ్‌ పిళ్త్లె- 12 (నాటౌట్‌), రాకేందు కుమార్‌- 11 (రనౌట్‌), జి.వివేక్‌ గోపన్‌- 1 (క్యాచ్‌), షఫీక్‌ రెహెమాన్‌ (నాటౌట్‌) ఏడు పరుగుల్ని సాధించగా 27 ఎక్స్‌ట్రాలతో లక్ష్యాన్ని సాధించారు.

    తెలుగు వారియర్స్‌ బౌలింగ్‌

    తెలుగు వారియర్స్‌ బౌలింగ్‌

    * రఘు- 4 ఓవర్లు- 16 పరుగులు, రెండు వైడ్లు

    * ప్రిన్స్‌- ఒక ఓవరు- 11 పరుగులు- ఐదు వైడ్లు

    * జోషి- 4 ఓవర్లు- 33 పరుగులు- ఒక వికెట్‌- ఒక వైడ్‌

    * అఖిల్‌- మూడు ఓవర్లు- 18 పరుగులు- ఒక వైడ్‌

    * నంద కిషోర్‌- నాలుగు ఓవర్లు, 31 పరుగులు- రెండు వైడ్లు

    * తరుణ్‌- ఒక ఓవరు- 12 పరుగులు- ఏడు వైడ్లు

    * ఆదర్శ్‌- మూడు ఓవర్లు- 15 పరుగులు- మూడు వికెట్లు

    ఛార్మీ ఉత్సాహం వర్కవుట్ కాలేదు

    ఛార్మీ ఉత్సాహం వర్కవుట్ కాలేదు

    వారియర్స్‌ గెలవాలంటూ కేరింతలతో ప్రేక్షకుల్లో ఛార్మి ఉత్సాహాన్ని నింపింది. కానీ తెలుగు వారియర్స్‌ జట్టు పరాజయం పాలైంది.

    వారియర్స్‌ కొంపముంచిన ఎక్స్‌ట్రాలు

    వారియర్స్‌ కొంపముంచిన ఎక్స్‌ట్రాలు

    తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్న వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగుల్ని సాధించింది. స్త్ట్రెకర్స్‌ బౌలర్లు ఐదు ఎక్స్‌ట్రా పరుగులిచ్చారు. వారియర్స్‌ బౌలర్లు ఏకంగా 27 ఎక్స్‌ట్రా పరుగులిచ్చారు. ఫలితం..... విజయాన్ని స్త్ట్రెకర్స్‌ సాధించారు. ఇందులో మూడు బైస్‌, నాలుగు లెగ్‌బైస్‌, 20 వైడ్స్‌. వారియర్స్‌ బౌలర్లు కాస్తంత జాగ్రత్తగా ఎక్స్‌ట్రాల్ని తగ్గించిన పక్షంలో సునాయాస గెలుపు సాధ్యమయ్యేది.

    English summary
    The Telugu Warriors ahead of a Celebrity Cricket League match between Telugu Warriors and Kerala Strikers at Chinnaswamy Stadium in Bangalore on Jan.26, 2014. For Telugu Warriors , Venkatesh and Sachin Joshi out for very low runs. High runs posted by Aadarsh. Great performance by Sudheer Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X