2.0 బ్లాస్టింగ్ మొదలైంది.. యునానిమస్ బ్లాక్‌బస్టర్.. రాజమౌళి, ఇంకా ఇతర సెలబ్రిటీల ట్వీట్స్!

Recommended Video

#2point0 : Celebrity Tweets And Reactions On Robo 2.O | Filmibeat Telugu

దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 2.0 నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్స్ షోలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు వ్యాప్తంగా రజనీకాంత్ అంభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇక థియేటర్ వద్ద అయితే అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రధాన నగరాలలో ఇప్పటికే సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా 2.0 చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రీమియర్ షోలు ముగిసిన కొన్ని ప్రాంతాల నుంచి ఈ చిత్రానికి యునానిమస్ బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్ట్స్ వస్తుండడం విశేషం.

ఆ రోజు వచ్చేసింది

సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 చిత్ర విడుదుల సందర్భంగా అర్థరాత్రి 12:15 గంటలకు ట్వీట్ చేశారు. 2.0 చిత్ర యూనిట్ సంబర పడే సమయం ఇది. అందరూ ఎదురుచూస్తున రోజు వచ్చేసింది అంటూ 2.0 రిలీజ్ గురించి ట్విట్టర్ లో స్పందించారు. రజనీకాంత్ ఈ చిత్రంలో చిట్టి రోబోగా చేసే విన్యాసాల కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

శంకర్ సర్ అంటూ రాజమౌళి

ప్రస్తుతం ఇండియాలో ఉన్న అద్భుతమైన దర్శకుల గురించి మాట్లాడవలసి వస్తే ముందుగా శంకర్, రాజమౌళి గురించే మాట్లాడుకోవాలి. భారత చలన చిత్ర స్థాయిని పెంచే దిశగా వీరిద్దరూ సినిమాలు రూపొందిస్తున్నారు. తాజాగా రాజమౌళి 2.0 చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. శంకర్ సర్ రూపొందించిన 2.0 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశా. ఎదురుచూపులు తెరదించుతూ నేడు సినిమా విడుదల కాబోతోంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ వివిధ రూపాలు చూడబోతున్నాం. 2.0 మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు అంటూ రాజమౌళి పేర్కొన్నారు.

2.0 బ్లాస్టింగ్

సంచలనం యువ సంగీత దర్శకుడు అనిరుధ్ 2.0 విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించాడు. భారత సినిమా చరిత్రలో గర్వించదగ్గ రోజు వచ్చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్, మాయాజాల దర్శకుడు శంకర్, అద్భుత నటుడు అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 చిత్రం విడుదల కాబోతోంది అంటూ అనిరుధ్ ట్వీట్ చేశాడు.

హీరో కార్తీ

భారీ రూపాలతో వస్తున్న 2.0 టీం మొత్తానికి శుభాకాంక్షలు. భారీ తనానికి మరో స్థాయి ఇది అంటూ హీరో కార్తీ ట్వీట్ చేశాడు.

భారీ విజయం సాధించాలని

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. కొన్ని సినిమాలని దర్శకుల కష్టం, ప్రతిభ కోసమైనా చూడాలి. అలాంటి చిత్రమే 2.0. శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ ఈ చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు తేజ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X