దర్శక ధీరుడికి సైరా డైరెక్టర్ స్పెషల్ విషెస్.. మహేష్ బాబు, మంచు మనోజ్ కామెంట్స్

Recommended Video

#HBDSSRajamouli | Celebs Birthday wishes To SS Rajamouli

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనుడు ఎస్‌ఎస్ రాజమౌళి. బాహుబలి సిరీస్ తో తెలుగోడి సత్తా ఏంటో దేశ విదేశాలకు ఎలుగెత్తి చూపారు జక్కన్న. మగధీర, ఈగ, సై, సింహాద్రి, ఛత్రపతి, యమదొంగ లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుంచారు. అందుకే ఆయన్ను టాలీవుడ్ చిత్రసీమ దర్శక ధీరుడు అని పిలుచుకుంటుంది.

చెక్కుచెదరని నవ్వుతో కొత్త ఆలోచనలతో

చెక్కుచెదరని నవ్వుతో కొత్త ఆలోచనలతో

ఎప్పుడూ చెక్కుచెదరని నవ్వుతో కొత్త ఆలోచనలకు రూపమిస్తూ దూసుకుపోయే రాజమౌళి ఈ రోజు తన 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు.

జక్కన్న సక్సెస్ కోరుకుంటూ సైరా డైరెక్టర్

రాజమౌళి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు స్పెషల్ విషెస్ తెలియజేశారు సైరా నరసింహా రెడ్డి డైరెక్టర్ సురేందర్ రెడ్డి. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఏడాది మీకు సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఐకానిక్ డైరెక్టర్ అంటూ మహేష్ బాబు

ఐకానిక్ డైరెక్టర్ రాజమౌళి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. మీరు ఎప్పటికీ ఇలాగే అన్ని తరాల ఫిలిం మేకర్స్ కి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

జక్కన్న మన సొంతం అంటూ మంచు మనోజ్

సూపర్ సెన్సేషనల్ ఫిలిం మేకర్, మన సొంతం జక్కన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలుపుతూ శివలింగాన్ని ఎత్తుకున్న రాజమౌళి సూపర్ పిక్ షేర్ చేశాడు మంచు మనోజ్.

ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్

ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్

బాహుబలి సిరీస్ తర్వాత RRR రూపంలో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు రాజమౌళి. డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X