»   » పిల్లలతో మహేష్ బాబు సందడి సిని'మా' అవార్డ్స్ (ఫోటోస్)

పిల్లలతో మహేష్ బాబు సందడి సిని'మా' అవార్డ్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాటీవీ వారు ప్రతి ఏటా నిర్వహిస్తున్న సినీ‘మా' అవార్డ్స్ 2015 కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, దేవిశ్రీ ప్రసాద్ తదితర స్టార్స్ రాకతో ఈ కార్యక్రమం సందడిగా సాగింది.

ఈ అవార్డుల కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు మహేష్ బాబు, నమ్రత, మంజు, సినీయర్ నరేష్ తదితరులు హాజరయ్యారు.

‘రేసు గుర్రం' చిత్రానికి గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ‘మనం' చిత్రానికి గాను సమంత ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్, సాయి ధరమ్ తేజ్, అదా శర్మ, దేవిశ్రీ ప్రసాద్ లైవ్ స్టేజీ పెర్ఫార్మెన్స్‌తో ఈ కార్యక్రమానికి మరింత ఊపు తెచ్చారు. స్లైడ్ షోలో సినీ‘మా' అవార్డ్సులకు సంబంధించిన ఫోటోలు.

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు తన భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతం కృష్ణలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి తన బ్రదర్ అల్లు శిరీష్, కజిన్ కొనిదెల నిహారికతో కలిసి హాజరయ్యారు. ఆయన తన అవార్డును దివంగత ప్రముఖ నిర్మాత రామానాయుడికి అంకితమిచ్చారు.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను సాయి ధరమ్ తేజ్ బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకున్నారు. తన స్టేజీ పెర్ఫార్మెన్స్ తో సాయి ధరమ్ తేజ్ ఆకట్టుకున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

లౌక్యం చిత్రానికి గాను రకుల్ ప్రీత్ సింగ్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. స్టైలిష్ లుక్ తో రకుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రాశి ఖన్నా

రాశి ఖన్నా

ఊహలు గుసగుసలాడే చిత్రానికి గాను రాశి ఖన్నా బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకుంది.

దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి అనసూయ స్టేజీపై సందడి చేసింది.

అదా శర్మ

అదా శర్మ

హీరోయిన్ ఆదా శర్మ కూడా తన లైవ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

హంసా నందిని

హంసా నందిని

ప్రత్యేక వస్త్రధారణతో హంసా నందిని ఆకట్టుకుంది.

English summary
CineMAA Awards 2015, presented by MAA TV took place yesterday in a grand event at Novotel, Hyderabad. The event was filled with glitz and glam and many of your favorite stars graced the event in style.
Please Wait while comments are loading...