దిష్టి తగిలిందా? పవన్, మహేష్, జూ ఎన్టీఆర్ నివాళి (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో వరుస పెట్టి ప్రముఖుల మరణాలు....తాజాగా తెలుగు సినిమా లెజెండ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అస్తమయం. అక్కినేని భౌతిక దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.....తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదో దిష్టి తగిలిందని, అందుకే పరిశ్రమలో వరుసగా పముఖుల మరణాలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. నాగేశ్వరరావుగారి మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొన్నారు.
హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.....భౌతికంగా ఆయన మన ముందు లేక పోయినా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారని వ్యాఖ్యానించారు. మరో నటుడు జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ...నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమకు ఉన్న రెండు కళ్లను కోల్పోయినట్లయిందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఆయన సాధించిన విజయాల గురించి కానివ్వండి, ఒక మహా మనిషిగా కానివ్వండి ఆయన గురించి మాట్లాడే అర్హత తనకు లేదని అన్నారు జూ ఎన్టీఆర్. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన చూపు కుటుంబం వైపు, ఇండస్ట్రీ వైపు ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
నటుడు పవన్ కళ్యాణ్, రాణా, రవితేజ, మోహన్ బాబు, మంచు విష్ణు, సాయి కుమార్, ఆది, సురేష్ బాబు, అనుష్క, బ్రహ్మానందం, కీరవాణి, రాజమౌళి, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, సిద్దార్థ, శ్రీకాంత్, సుమన్ తదితరులు అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

మహేష్ బాబు
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న మహేష్ బాబు

నాగబాబు
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న నాగబాబు

రమ, రాజమౌళి
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ

నాగ చైతన్య
తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయ వద్ద నాగ చైతన్య. పక్కన పిఆర్ఓ, నిర్మాత బిఏ రాజు

జై ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న జూ ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి

రాజశేఖర్
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న నటుడు రాజశేఖర్

కళ్యాణ్ రామ్
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వచ్చిన హరికృష్ణ, కళ్యాణ్ రామ్

నమ్రత శిరోద్కర్
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న నమ్రత శిరోద్కర్

కీరవాణి
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న సంగీత దర్శకుడు కీరవాణి

మోహన్ బాబు, విష్ణు
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్న మోహన్ బాబు, విష్ణు

జయసుధ
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయం వద్ద కంటతడి పెడుతున్న నటి జయసుధ. నాగేశ్వరరావు సరసన జయసుధ పలు చిత్రాల్లో నటించింది.

జమున
అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అనేక చిత్రాల్లో నటించిన సినీయర్ నటి జమున....ఆయన మరణం తట్టుకోలేక కన్నీటిపర్యంతమైంది.

బ్రహ్మానందం
అక్కినేని నాగేశ్వరరావు మరణ విని పరుగు పరుగు అక్కడికి చేరుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం

అనుష్క
అక్కినేని నాగేశ్వరావు మరణ వార్త విన్న వెంటనే అక్కడికి చేరుకున్న నటి అనుష్క

రవితేజ
నటుడు రవితేజ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నప్పటి దృశ్యం.

సాయికుమార్, ఆది
అక్కినేని భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్న నటుడు సాయికుమార్, హీరో ఆది

రాణా
హీరో రాణా అక్కినేని భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుంటున్న దృశ్యం.

సిద్ధార్థ
అక్కినేనితో కలిసి చుక్కల్లో చంద్రుడు చిత్రంలో నటించిన హీరో సిద్ధార్థ ఈ సందర్భంగా అక్కినేనితో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

శుభ్రం చేస్తూ అఖిల్
తాతయ్య భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి పూలతో నివాళ్ళు అర్పించారు. పూలు బాగా పేరుకుపోవడంతో శుభ్రం చేస్తున్న అఖిల్.

రాఘవేంద్రరావు
అక్కినేనితో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు రాఘవేంద్రరావు అక్కినేని మృతి విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకున్నారు.

సుమన్
అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న నటుడు సుమన్


Click it and Unblock the Notifications











