twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లడీ ‘ఎ’ సినిమా.... ‘రంగస్థలం’పై సినీ ప్రముఖల రివ్యూలు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Celebrities Tweets On Rangasthalam

    రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రానికి ఆడియన్స్, క్రిటిక్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ సినిమాపై పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' స్టైల్లో ప్రశంసలు గుప్పించారు. మరో వైపు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఈ సినిమాపై తన రివ్యూ పోస్టు చేసింది. రామ్, వరుణ్ తేజ్, ఎస్ఎస్ కార్తికేయ, మంచు లక్ష్మి, రాశి ఖన్నా తదితరులు స్పందించారు.

    బ్లడీ ‘ఎ’ సినిమా

    రంగస్థలం మూవీ బ్లడీ ‘ఎ' సినిమా అంటూ కామెంట్ చేసిన విజయ్.... సుకుమార్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్టు చేశారు. నటన ‘ఎ', దర్శకత్వం ‘ఎ', కెమెరా పనితనం ‘ఎ', సంగీతం ‘ఎ', నిర్మాణ విలువలు ‘ఎ'.. చరణ్‌, సామ్, సుక్కు, మైత్రీ, డీఎస్పీ, రత్నవేలు‌.. సూపర్‌' అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో అన్నీ ఎ క్లాస్‌గా ఉన్నాయని తనదైన శైలిలో చెప్పారు.

    నిహారిక కొణిదెల

    ‘రంగస్థలం' సినిమా ఎక్సలెంటుగా ఉందంటూ మెగా డాటర్ నిహారిక రివ్యూ పోస్టు చేశారు. సుకుమార్ డైరెక్షన్ టాప్ రేంజిలో ఉంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతం, దేవిశ్రీ ప్రసాద్ రీరికార్డింగ్, మ్యూజిక్ అందరినీ కట్టపడేసింది. ఇక చిట్టిబాబుగా అన్నయ్య రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది. కోపం, ప్రేమ, ఆనందం, బాధ, కామెడీ, ఇన్నోసెన్స్, డాన్స్ ఇలా అన్ని విషయాల్లో అదరగొట్టారు. మా అన్నా మజాకా! టీం మొత్తానికి కంగ్రాట్స్... అని నిహారిక వ్యాఖ్యానించారు.

    హీరో రామ్ ఏమన్నారంటే...

    దర్శకుడు సుక్కు ‘రంగస్థలం' చిత్రాన్ని ఎంతో బ్రిలియంట్‌గా తెరకెక్కించారు. డీఎస్పీ మరోసారి మ్యూజిక్ మీద తన పాషన్ ఏమిటో చూపించాడు. రత్నవేలు ఎక్స్ పీరియన్స్, సమంత మ్యాజిక్, రామ్ చరణ్ వన్ మెన్ షో... ఓవరాల్ సినిమా సూపర్. అందరికీ కంగ్రాట్స్ అంటూ హీరో రామ్ ట్వీట్ చేశారు.

    అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్

    రంగస్థలం మూవీ అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని మంచు లక్ష్మి అన్నారు. రామ్ చరణ్ అదరొట్టారు, సమంత స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, సుకుమార్ అద్భుతంగా తీశారు అని పొగడ్తల వర్షం కురిపించారు.

    నవదీప్

    రంగస్థలం సినిమా చూసిన అనంతరం రామ్ చరణ్, సుకుమార్ లకు హాట్సాఫ్ చెప్పారు హీరో నవదీప్. ప్రతి యాక్టర్ పెంటాస్టిక్‌గా చేశారని ప్రశంసించారు.

    రాశీ ఖన్నా

    రంగస్థలం మూవీ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని రాశీ ఖన్నా ప్రశంసలు గుప్పించారు. సినిమా హీరో హీరోయిన్, నటీనటులు, దర్శకుడు, ఇతర టెక్నీషియన్లపై ఆమె ప్రశంసలు గుప్పించారు.

    వరుణ్ తేజ్

    రంగస్థలం సినిమా, చిట్టి బాబు క్యారెక్టరైజేషన్ బాగా నచ్చడంతో తన ట్విట్టర్ అకౌంట్ డిస్లే నేమ్‌ను చిట్టిబాబుగా మార్చుకున్నాడు వరుణ్. వరుణ్ ఈ సినిమాపై ఏమని ట్వీట్ చేశాడో మీరూ ఓ లుక్కేయండి.

    కామెంట్ కార్తికేయ

    రంగస్థలం సినిమా చూసిన అనంతరం కార్తికేయ విభిన్నంగా స్పందించారు. చరణ్, సకుమార్ అంటూ జపం చేశారు. సమంత పెర్ఫార్మెన్స్, రత్నవేలు డిఓపీ అద్భుతం అంటూ ప్రశంసించారు.

    English summary
    Many celebs are impressed with Rangasthalam and they could not stop raving about Ram Charan, Samantha Akkineni, director Sukumar, other cast and crew for their wonderful work in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X