'గోపాల గోపాల' పై సినీ సెలబ్రెటీల స్పందన

By Srikanya

హైదరాబాద్ : వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందిన 'గోపాల గోపాల' చిత్రం రెండు రోజుల క్రితం శనివారం రోజు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. సామాన్య మానవుడు దేవుడిపై కేసు పెట్టి కోర్టుకీడ్చే అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇది హిందీ చిత్రం 'ఓ మైగాడ్'కి రీమేక్. ఈ చిత్రంపై అభిమానులే కాకుండా సినిమా వారు చాలా అంచనాలు పెట్టుకున్నారు. సినిమాని చూసి ఆనందంతో వారు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఏమన్నారో ఓ సారి చూద్దాం.

వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల' . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శనివారం (10వ తేదీ) విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్‌ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది.
ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటించారు.

ఎవరేమన్నారు స్లైడ్ షోలో చూద్దాం...

వరుణ్ తేజ

వరుణ్ తేజ

ఆ క్రేజ్,హిస్టీరియా ఊహించలేం...హైదరాబాద్ కుకుట్ పల్లి శివపార్వతి థియోటర్ లో చూసా...వావ్...అదో పిచ్చి ఫన్

నిఖిల్

నిఖిల్

సినిమా చూసాను. పవర్ స్టార్ ఛార్మ్ , వెంకటేష్ సార్..ఫెరఫార్మెన్స్ ఈ సినిమాని అద్బుతంగా మార్చేసాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్

గోపాల గోపాల టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్

హరీష్ శంకర్

హరీష్ శంకర్


అన్ని చోట్ల నుంచి మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్ లు వస్తున్నాయి. కంగ్రాట్స్ సార్

గోపీ మోహన్

గోపీ మోహన్

2015 లో సూపర్ సక్సెస్ ఫుల్ చిత్రం ఇచ్చినందుకు గోపాల గోపాల టీమ్ కు అభినందనలు... అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి

సుమంత్

సుమంత్

గోపాల గోపాల టీమ్ కు బిగ్ కంగ్రాట్యువేషన్స్

అనూప్ రూబెన్స్

అనూప్ రూబెన్స్

భజే బాజే సాంగ్ కు కాలిఫోర్నియోలో జనం రోడ్ల మీద డాన్స్ లు వేస్తున్నారు. చాలా ఎక్సైంటింగ్ గా ఉంది.

బండ్లగణేష్

బండ్లగణేష్


పూలాభిషేకం నీకే...ప్రాణాభిభేషం నీకే...కనకాభిషేకం నీకే..జయబోలో గోపాల గోపాల

లక్ష్మీ మంచు

లక్ష్మీ మంచు

ఏ సినిమా హిట్ అన్నా చాలా చెవులకు సంగీతంలా అనిపిస్తుంటుంది. హిట్ల వల్లే ఇండస్ట్రీ గ్రోత్ అవుతుంది. గోపాల గోపాల కూడా హిట్

అనీష్ ఆంబ్రోస్(గబ్బర్ సింగ్ 2 హీరోయిన్)

అనీష్ ఆంబ్రోస్(గబ్బర్ సింగ్ 2 హీరోయిన్)

ఇంటర్వెల్ టైమే కాని... నిజానికి ఇంటర్వెల్ లేదు. అంతా ఆసమ్ గా ఉంది..

శాన్వి

శాన్వి

డెస్పరేట్ గా ఈ చిత్రం చూడాలని ఎదురుచూస్తున్నా

నితిన్

నితిన్

తెలుగు సినిమా కలియుగ గోపాలుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీ మేజిక్ ..మీ ఛరిష్మా మీ స్మైల్...అదే గోపాల గోపాల. ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు మొత్తం టీమ్ కు నా శుభాకాంక్షలు

వెన్నెల కిషోర్

వెన్నెల కిషోర్

లవ్ డ్ ఇట్..వెంకీ సార్ రాకెడ్...మమ్మల్ని నవ్వించారు..ఏడ్పించారు..ప్రతీ ఫ్రేమ్ ఫెరఫెక్షన్ తో మీరు చేసారు..లవ్ యూ సార్.. పవర్ స్టార్ గురించి చెప్పాలంటే మాటలు లేవు.. రోలింగ్ టైటిల్స్ జంబో బోనస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X