బాహుబలి నేనే నిర్మించినట్లుంది, రాజమౌళికి శిరస్సు వంచి...
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' సినిమా చూసి ఇతర సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘బాహుబలి' సినిమా ద్వారా రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడని, భారతీయ సినిమా పరిశ్రమ రేంజిని మరింత పెంచాడని కొనియాడుతున్నారు.
రాజమౌళి సినిమాపై పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా తమ తమ అభిప్రాయాలు తెలిపారు. టాలీవుడ్ నటి, నర్మాత మంచు లక్ష్మి స్పందిస్తూ...‘బాహుబలి సినిమాను నేనే నిర్మించినట్లు ఫీలవుతున్నాను. బాహుబలి సినిమా అద్భుతంగా ఉంది. రాజమౌళికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బాహుబలి మూవీ ప్రూర్ విజువల్ ట్వీట్. సెకండ్ పార్ట్ కోసం వేచి ఉండటం నా వల్ల కాదు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా' అంటూ ట్వీట్ చేసారు.
ప్రతి భారతీయుడు గర్వించే సినిమా ‘బాహుబలి' అంటూ అఖిల్ ట్వీట్ చేసాడు. రాజమౌళి సార్ కి థాంక్స్ తెలిపాడు.
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్... బాహుబలి బలి రిలీజైన ఎప్పటికీ గుర్తుంటుంది. తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న రోజు అంటూ ట్వీట్ చేసాడు.
బాహుబలి గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు. ఔట్ స్టాండింగ్ ఫిల్మ్. సెకండాఫ్ వరకు ఆగడం నా వల్ల కాదు. సెల్యూట్ రాజమౌళి సార్ అంటూ ట్వీట్ చేసారు రఘు కుంచె
తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే సినిమా బాహుబలి అంటూ వెన్నెల కిషోర్ ట్వీట్ చేసారు


Click it and Unblock the Notifications











