షాకయ్యాం : ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సెలబ్రిటీల ట్వీట్స్

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు శ్రీహరి మరణం, ఆ వెంటనే ప్రఖ్యాత కమెడియన్స్ ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం విషాదాల నుంచి తేరుకోక ముందే.....ఇపుడు యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఉదయ్ కిరణ్ మరణించాడనే వార్తను ఉదయాన్నే విన్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు షాకయ్యారు. ఆయన మృతికి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు......

'ఈగ' సుదీప్: ఉదయ్ కిరణ్ న్యూస్ విని షాకయ్యాను. వారం రోజుల క్రితమే అతన్ని కలిసాను. ఇంతలోనే ఇలా జరుగడం తట్టుకోలేక పోతున్నాను.

తాప్సి : సినిమా ఇండస్ట్రీలలో ఆత్మహత్య రేట్ పెరిగిపోవడం చూస్తుంటే భయమేస్తుంది.

ప్రియమణి: నిద్రలేవగానే ఉదయ్ కిరణ్ మరణించాడనే వార్త విని షాకయ్యాను. మంచి మనస్తత్వం, స్నేహ స్వభావం గల వ్యక్తి. ఈ విషయం విని షాకయ్యాను.

లక్ష్మి మంచు : ఉదయ్ కిరణ్ వార్త విని గుండె పగిలినంత పనైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

మంచు మనోజ్ : ఇది చాలా విషాద సంఘటన. మంచి స్నేహితుడిని కోల్పోయాను. అతని కుటుంబ సభ్యులకు దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలి.

వరుణ్ సందేశ్ : వెరీ వెరీ సాడ్ న్యూస్. ఎంతో మంచి వ్యక్తి, టాలెంట్ ఉన్న యాక్టర్. అతను మరణించిన విషయాన్ని ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను.

సందీప్ : కిషన్ : ఉదయ్ కిరణ్ వార్త విని షాకయ్యాను. నైస్ పర్సన్. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి.

మధు శాలిని: ఉదయ్ కిరణ్ మరణ వార్త విని షాకయ్యాను.

మధుర శ్రీధర్ : మూడు నెలల క్రితం ఉదయ్ కిరణ్‌ను కలిసాను. మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో కాన్ఫిడెంటుగా కనిపించాడు. కానీ ఇలా నిరాశతో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదు.

గోపీచంద్ మలినేని : రియల్లీ సాడ్ న్యూస్....

నికీషా పటేల్: ఉయద్ కిరణ్‌ను ఇప్పటి వరకు కలవలేదు. కానీ అతని గురించి చాలా విన్నాను. ఆతని ఆత్మకు శాంతి చేకూరాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X