వాళ్ల ఎఫైర్లు ఫేక్ అని తేలిపోయింది! (ఫోటోలు)

By Bojja Kumar

ముంబై: సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్లు అనేవి సర్వ సాధారణం. చాలా మంది స్టార్ల ఎఫైర్ల ప్రేమగా, ఆ తర్వాత పెళ్లికి కూడా దారి తీసాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎఫైర్లు ఉన్న హీరో హీరోయిన్లకి పబ్లిసిటీ కూడా భాగా వస్తోంది. ఇలాంటి ఎఫైర్లు వారి స్టార్‌డమ్ పెంచేస్తున్నాయి. దీంతో కొంత మంది ఫేక్ ఎఫైర్లు కూడా నడిపిస్తున్నారు.

కొంత మంది స్టార్స్ కావాలనే తమ మధ్య ఎఫైర్ ఉందనే వాతావరణం సృష్టించి పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో ఇలాంటివి ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి. మీడియా వారి దృష్టిని ఆకర్షించడానికే ఇదంతా చేస్తున్నారు. ఇలా చేసి కొందరు సక్సెస్ అయ్యారు కూడా...

అయితే మరికొందరి స్టార్స్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. స్టార్లకు సంబంధం లేకుండా దర్శక, నిర్మాతలు తమ సినిమాల ప్రచారం కోసం హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు సృష్టిస్తున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

ఇమ్రాన్ ఖాన్-జెనీలియా

ఇమ్రాన్ ఖాన్-జెనీలియా

‘జానె తూ యా జానె నా' చిత్రంలో కలిసి నటించిన ఇమ్రాన్ ఖాన్, జెనీలియా మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఫేక్ అని తేలి పోయింది. ఇమ్మాన్ తన చిన్నాటి స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, జెనీలియా తన సహచర నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

హృతిక్ రోషన్-బార్బరా మోరీ

హృతిక్ రోషన్-బార్బరా మోరీ

కైట్స్ సినిమాలో కలిసి నటించిన హృతిక్ రోషన్, బాలీవుడ్ బ్యూటీ బార్బరా మోరీ సినిమాలోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా రొమాన్స్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఆ వార్తలు ఫేక్ అని తేలి పోయాయి.

సల్మాన్ ఖాన్-క్లాడియా సీస్లా

సల్మాన్ ఖాన్-క్లాడియా సీస్లా

బిగ్ బాస్ సీజన్ సమయంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ జర్మన్ బ్యూటీ క్లాడియా సీస్లాతో సంబంధం పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.

జాన్ అబ్రహం-కత్రినా కైఫ్

జాన్ అబ్రహం-కత్రినా కైఫ్

కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన న్యూయార్క్ చిత్రంలో కలిసి నటించిన సమయంలో జాన్ అబ్రహం-కత్రినా కైఫ్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా విడుదల తర్వాత ఆ వార్తలు వినిపించలేదు.

అక్షయ్ కుమార్-ప్రియాంక చోప్రా

అక్షయ్ కుమార్-ప్రియాంక చోప్రా

అప్పట్లో ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.....అయితే ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కే అని అతి త్వరలోనే ప్రేక్షకులు పసిగట్టారు.

షాహిద్ కపూర్-విద్యా బాలన్

షాహిద్ కపూర్-విద్యా బాలన్

కిస్మత్ కనెక్షన్ అనే చిత్రంలో నటించిన షాహిద్, విద్యా బాలన్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే సినిమాకు పబ్లిసిటీ పెంచేందుకే ఈ వార్తలు సృష్టించారనేది ఆ తర్వాత తేలింది.

హృతిక్ రోషన్-కరీనా కపూర్

హృతిక్ రోషన్-కరీనా కపూర్

హృతిక్ రోషన్, కరీనా కపూర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వారి రియల్ లైఫ్‌లో వారికి వేర్వేరు లవర్స్ ఉండటంతో ఎవరూ ఆ విషయం నమ్మలేదు.

షారుక్ ఖాన్-ప్రియాంక చోప్రా

షారుక్ ఖాన్-ప్రియాంక చోప్రా

డాన్ 2 చిత్రం సమయంలో షారుక్, ప్రియాంక మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అదంతా డాన్ 2 సినిమా ప్రమోషన్ కోసం సృష్టించిన ఫేక్ వార్తలు అని ఆ తర్వాత తేలింది.

సల్మాన్ ఖాన్-అసిన్

సల్మాన్ ఖాన్-అసిన్

‘రెడీ' సినిమా చేస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్, ఆసిన్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అదంతా సినిమా పబ్లిసిటీ కోసమే అని ప్రేక్షకలు పసిగట్టేసారు.

షాహిద్ కపూర్-అమృతా రావు

షాహిద్ కపూర్-అమృతా రావు

షాహిద్ కపూర్-అమృతరావు అప్పట్లో వెండితెరపై రొమాన్స్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇష్క్-విష్క్, వివాహ్ సినిమాల విడుదల తర్వాత వీరి ఎఫైర్ వార్తలు మరుగున పడిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X