కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను బాలీవుడ్ సెక్స్ బాంబ్ సెలీనా జైట్లీ లైంగిక వేధింపులకు గురిచేస్తోంది. అయితే అది 'శ్రీమతి' అనే చిత్రం కన్నడ చిత్రం కోసం. ఆ చిత్రంలో ఆమె ఎన్నారై గర్ల్ గా కనిపించనుంది. ఆమె తన క్రింద పని చేసే ఉపేంద్రను లైంగిక వేధింపులకు గురిచేస్తుంది. ఉన్న ఉద్యోగం వదులుకోలేక అటు భార్యకు చెప్పుకోలేక అతను నలిగిపోతూంటాడు. అతని భార్యగా ఉపేంద్ర నిజ జీవిత భార్య ప్రియాంక చేస్తోంది. బాలీవుడ్ లో ఐత్ రాజ్ పేరుతో వచ్చిన ఈ చిత్రంని ఫ్రీమేక్ చేస్తున్నామని సెలీనా చెప్తోంది. అక్షయ్ కుమార్ ,ప్రియాంకచోప్రా నటించిన ఈ చిత్రం అక్కడ ఓ మాదిరి విజయం సాధించింది. ఆ సినిమానే ఆ మధ్య తమిళంలో నమిత హీరోయిన్ గా వచ్చి పెద్దగా వర్కవుట్ కాకవెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు భాషలోకి సైతం అనువదించే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.అలాగే శంకర్ గౌడ్ అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సంపత్ నంది శ్రీమతి చిత్రానికి డైరక్ట్ వహిస్తున్నాడు. సంపత్ నంది గతంలో ఉపేంద్ర నటించిన టాస్ చిత్రానికి మాటలు అందించిన విషయం తెలిసిందే.టాస్ చిత్రాన్ని ప్రియదర్శని రామ్ డైరక్ట్ చేసారు.రాజా,ఉపేంద్ర,ప్రియమణి ప్రధానపాత్రల్లో నటించారు.