బికినీలో కవల పిల్లలతో కలిసి సెలీనా జైట్లీ...
బాలీవుడ్ హాట్ నటి సెలీనా జైట్లీ పీటర్‌హాగ్ అనే ఆస్ట్రేలియా వ్యాపారిని పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా సెలీనా తన అందాలను ఏమాత్రం చెక్కు చెరకుండా మెయింటెన్ చేస్తోంది. తాజాగా తన ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి బికినీలో దిగిన ఫోటోలను ఈ భామ ట్విట్టర్లో పోస్టు చేసింది.
సెలీనా వాలకం చూస్తుంటే మళ్లీ సినిమాల్లోకి వస్తుందేమోననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. పీటర్ హాగ్‌ను సెలీనా జులై 23, 2011లో పెళ్లాడింది. వీరికి పుట్టిన కవల పిల్లలకు ఒకరికి విన్‌స్టన్, మరొకరికి విరాజ్ అని పేరు పెట్టారు.
పెళ్లికి ముందే రెండేళ్లుగా సెలీనా-పీటర్ హాగ్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. 2010 దుర్గా పూజ సందర్భంగా ఈ ఇద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి విషయాన్ని అందరికీ చెప్పి గ్రాండ్‌గా చేసుకుంటుందని అభిమానులు ఆశించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా రహస్యంగా పెళ్లి చేసుకుని శోభనం కూడా కానిచ్చేసి..తీరిగ్గా నెల రోజుల తర్వాత విషయాన్ని బయట పెట్టింది అమ్మడు.
మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు తొలిసి సినిమా 'సూర్యం" ద్వారా అప్పట్లో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ సెక్సీ తార ఆ సినిమా పరమ ప్లాపు కావడంతో మళ్లీ తెలుగు తెరవైపు చూడలేదు.


Click it and Unblock the Notifications












