లెస్బియన్ హక్కుల కోసం ఆ హీరోయిన్
లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌ల సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నామని బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జెట్లీ చెబుతోంది. ఇందుకోసం 'ఖాషిష్' అనే పేరుతో 'గే' చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరమే కాదని కేంద్రం తేల్చిన చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తోంది. ఇక ఈ చిత్రోత్సవాల ఆలోచన కూడా సెలీనాదే కావటం గమనార్హం. ముంబైలో నిర్వహించనున్న ఈ చిత్రోత్సవాలను 'ఖీర్' పేరుతో కూడా పిలుస్తున్నారు. ఇందులో ఏకంగా 110 చిత్రాలను ప్రదర్శించనున్నామని, దీనికోసం ప్రత్యేకంగా ఓ ట్రెయిలర్‌ను కూడా రూపొందించానని సెలీనా జెట్లీ చెప్పింది. ఈ ట్రెయిలర్ ను త్వరలో మీడియాకు విడుదల చేస్తానంది. అయితే గే ఫిలిం ఫెస్టివల్ కేవలం వినోదం కోసం మాత్రమే కాదని తేల్చి చెబుతోంది.
సెలీనా జైట్లీ ఖాషిష్ ముంబై ట్రయిలర్ లెబ్సియన్ గే ఖీర్ celina jaitley gay lesbian film festival mumbai inaugurate


Click it and Unblock the Notifications