»   »  ఇంకో షాక్ : సన్నిలియోన్ ని అద్దె ఇంట్లోంచి గెంటేసారు

ఇంకో షాక్ : సన్నిలియోన్ ని అద్దె ఇంట్లోంచి గెంటేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : అసలే రకరకాల కేసులతో సతమతమవుతున్న సన్నిలయోన్ కు ఇంకో సమస్య వచ్చి పడింది. ఈ అడల్ట్ హీరోయన్ ఇప్పుడు ఇల్లు లేనిది అయ్యింది. ఆమెను ఇంటి ఓనర్ ...ఇంట్లోంచి అర్జెంటుగా ఖాళీ చేయమని వార్నింగ్ ఇవ్వటంతో ఖాళీ చేసి, ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటోంది. ఇంతకీ ఆ ఇంటి ఓవర్ ఎవరో తెలుసా..ఇంకో హీరోయిన్ సెలీనా జైట్లీ. ఇంతకీ సెలీనా ఎందుకంత కోపంతో ఇలాంటి డెశిషన్ తీసుకుందీ అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సన్నిలియన్ కు అడల్ట్ స్టార్ అనే ముద్ర ఉండటంతో ఆమెకు అద్దెకు ఇల్లు ఇవ్వటానికి ముంబైలో ఎవరూ ఉత్సాహం చూపలేదు. దాంతో అద్దె ఇల్లు దొరక్క ఇబ్బంది పడుతున్న ఆమె హీరోయిన్ సెలీనా జైట్లీ ఇంట్లో దిగింది. అయితే సన్నిలియోన్ ...శుభ్రంగా ఉండకపోవటం, అపార్టమెంట్ ని క్లీన్ గ ఉంచకపోవటం, ఫర్నీచర్ వాసన రావటం తో చిరాకెత్తిన సెలీనా జైట్లీ ఆమెను ఇమ్మిడియట్ గా ఖాళీ చేయించింది. ప్రస్తుతం సన్నిలియోన్...తన భర్త డానియల్ వైబర్ తో కలిసి...ఓ ఫైవ్ స్టార్ హీటల్ లో ఉంటూ తన ప్రాజెక్టులు పూర్తి చేస్తోంది.

Celina Jaitley irked by Sunny Leone, kicks her out

ఇక కేసుల విషయానికి వస్తే....

అడల్ట్ స్టార్ ఇమేజ్ ని వదిలించుకుని బాలీవుడ్ హీరోయిన్ గా ఎదగాలనే సన్నీలియోన్ కి కలిసి వస్తున్నట్లులేదు. ఆమెపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆమె అర్ధనగ్న, నగ్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో ఉన్నాయంటూ, వాటి వలన యువత పెడదారిన పడుతోందంటూ కేసుల మీద కేసులు పడుతున్నాయి. రెండు రోజుల క్రితం ముంబై నుంచి ఓ సామాజిక కార్యకర్త ఈ విషయమై పిర్యాదు చేసిన విషయం మరువక ముందే మరో కంప్లైంట్ వచ్చింది.

తాజాగా చెన్నై, పోరూర్ కు చెందిన మోసస్ అనే సమాజ సేవకుడు నటి సన్నీలియోన్ పై నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ.. ఇటీవల ఒక కుర్రాడు తనను కలిశారన్నారు.అప్పుడు క్రికెట్ కళాకారుడు సునిల్‌గవాస్కర్ గురించి కొంత సమాచారం తెలుసుకోవడానికని అతని సెల్ ఫోన్లో సన్ని అనే పేరుతో నెట్‌ను ఓపెన్‌చేయగా, అందులో నటి సన్ని లియోన్ అశ్లీల దృశ్యాలు పలు చోటు చేసుకున్నట్టు తెలిపారు.

ఇలాంటి దృశ్యాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయని , బాల నేరస్తులుగా మార్చే అవకాశం ఉందని, కాబట్టి ఇలాంటి దృశ్యాలను ప్రవేశ పెట్టిన ఇంటర్నెట్ సంబంధించిన వారిని అశ్లీల ఫోజు ఇచ్చిన నటి సన్నిలియోన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక ఇప్పటికే...

వెబ్ సైట్లలో అశ్లీల చిత్రాలను ఉంచినందుకు సినీ నటి సన్నీలియోన్ పై థానే పోలీసులు కేసు నమోదు చేశారు. సన్నీ లియోన్ పై ఐపిసి సెక్షన్లు 292, 294ఎ, సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంజలి పలన్ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

మరో ప్రక్క సన్నిలియోన్ కు ..

దక్షిణాదిన క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. బాలీవుడ్‌ నటి సన్నీలియోని త్వరలో 'లవ్‌ యూ అలియా' అనే కన్నడ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి, ప్రత్యేక గీతంలో నృత్యం చేయనుంది. ఈ సినిమా దర్శకుడు ఇంద్రజిత్‌ మాట్లాడుతూ జూన్‌లో సన్నీలియోనికి సంబంధించిన భాగం చిత్రీకరిస్తామని తెలిపారు. హీరో సుదీప్‌ కూడా ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నారు. ఇది వరకే 'డికే' అనే కన్నడ సినిమాలో సన్నీ ప్రత్యేక గీతంలో నర్తించింది.

English summary
Celina Jaitley who has rented her flat to this adult heroine Sunny Leone has given her the punch. When Sunny failed to keep the apartment clean and with furniture getting rotten smell, Celina kicked her out from the apartment.
Please Wait while comments are loading...