నా సెక్స్ లైఫ్ ఆయనకెందుకు?
స్వలింగ సంపర్కం అంశంపై ప్రముఖ యోగా గురువు బాబా రాందావ్, బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మధ్య మెదలైన మాటల యుధ్దం క్రమంగా వ్యక్తిగత దూషణల స్ధాయికి దిగజారుతోంది. సెలీన్ నెలకోసారి భోయ్ ప్రెండ్స్ ని మారుస్తుందని,తల్లి తండ్రులకు ఆమె దూరంగా ఉండటం వల్లే ఇలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తోందంటూ రాందేవ్ చేసి వ్యాఖ్యలపై సెలీనా తీవ్రంగా స్పందించింది.
దానితో మండిన సెలీనా రాందేవ్ ను కౌరవుల వారసుడిగా అభివర్ణించింది. రాందేవ్ ని ఇప్పటివరకూ కేవలం ఓ బ్రహ్మచారిగానే భావించా.నేను నెలకొకసారి బోయ్ ప్రెండ్స్ ని మారుస్తానంటూ నా వ్యక్తిగత లైంగిక జీవితం గురించి ఆయనలాంటి వ్యక్తి ఇలా ప్రస్తావిస్తారని నేనెప్పుడూ ఊహించలేదు. బ్రహ్మచారులందరూ పరాయి స్త్రీలను తల్లిగా భావిస్తారు. అయితే నా లైంగిక జీవితం గురించి నా కన్నా ఎక్కువగా తెలిసన బాబా బహుశా ఆయనేనేమో. అంటూ ఘాటుగా విమర్శించింది. అలాగే స్వలింగ సంపర్కంపై రాందేవ్ అభిప్రాయాలు అర్థం లేనివని తోసిపచ్చింది.
రాందేవ్ చెప్పినట్లు స్వలింగ సంపర్కం అనేది వ్యాధి కాదనీ, అలా అని స్వలింగ సంపర్కులు భావించడం లేదని చెప్పింది. కనుక వ్యాధిలేనివారికి జబ్బు నయం చేస్తానంటూ బాబా ముందుకురావడం అర్థంలేని పనే అవుతుందని ఎద్దేవా చేసింది. యోగా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపేవారికి రాందేవ్ యోగా నేర్పుకోవచ్చని, కానీ స్వలింగ సంపర్కులు ఎలా తినాలో, ఎలా పడుకోవాలో, ఎలా నడచుకోవాలో చెబితే వినేందుకు స్వలింగ సంపర్కులు సిద్ధంగా లేరని ఘాటుగా స్పందించింది సెలీనా.


Click it and Unblock the Notifications











