పీటర్ హాగ్‌ను పెళ్లి చేసుకున్న సెలీనా జైట్లీ
బాలీవుడ్ హాట్ నటి సెలీనా జైట్లీ ఓ ఇంటిదైంది. పీటర్‌హాగ్ అనే ఆస్ట్రేలియా వ్యాపారిని పెళ్లి చేసుకుంది. గత నెల(జులై) 23న ఆస్ట్రేలియాలోని చారిత్రాత్మక చర్చిలో వీళ్ల వివాహం జరిగింది. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ పోస్టు చేసింది. కుటుంబ అంతర్గత సమస్యల వల్ల ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్పాల్సి వచ్చిందని...అభిమానులు, శ్రేయోభిలాషులు దీన్ని అర్థం చేసుకుని తమను ఆశీర్వదించాలని ట్విట్టర్ లో పేర్కొంది.
గత రెండేళ్లుగా సెలీనా-పీటర్ హాగ్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. గత సంవత్సరం దుర్గా పూజ సందర్భంగా ఈ ఇద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి విషయాన్ని అందరికీ చెప్పి గ్రాండ్‌గా చేసుకుందని అభిమానులు ఆశించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా రహస్యంగా పెళ్లి చేసుకుని శోభనం కూడా కానిచ్చేసి..తీరిగ్గా నెల రోజుల తర్వాత విషయాన్ని బయట పెట్టింది అమ్మడు.
మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు తొలిసి సినిమా 'సూర్యం" ద్వారా అప్పట్లో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ సెక్సీ తార ఆ సినిమా పరమ ప్లాపు కావడంతో మళ్లీ తెలుగు తెరవైపు చూడలేదు.


Click it and Unblock the Notifications











