»   » హీరోయిన్ ఓవర్ ఎక్స్‌‌పోజింగుపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం

హీరోయిన్ ఓవర్ ఎక్స్‌‌పోజింగుపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ మరీ ఎక్కువ అవుతుందనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని దర్శకులను అడిగితే...ట్రెండు మారింది కాబట్టి ప్రేక్షకుల అభిరుచి ప్రకారం నడుకోక తప్పడం లేదనే వాదన వినిపిస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సెన్సార్ బోర్డు తన పని తాను చేసుకుపోతోంది.

తాజాగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'ది ఎక్స్‌ఫోజ్' అనే చిత్రానికి సెన్సార్ ఇబ్బందులు తప్పడం లేదు. సినిమా పేరులోనే 'ఎక్స్‌పోజ్' అనే పదం ఉంది...ఇలాంటపుడు సినిమాలో కాస్త మసాలా లేకుండా ఏం బాగుంటుంది? అనే ఉద్దేశ్యంతో ఇందులో నటిస్తున్న హీరోయిన్ జోయా అఫ్రోజ్‌పై హాట్ హాట్‌గా బికినీ సీన్లు చిత్రీకరించారు.

Censor Board Ask Makers Of The Xpose To Blur Zoya Afroz’s Cleavage!

అయితే ఆ సీన్ల కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయని, కొన్ని సీన్లు బ్లర్ చేయాలని సెన్సార్ బోర్డు సభ్యులు అడ్డు చెప్పారు. ఆ సీన్లో తప్పుడు ఉద్దేశ్యం లేదని....సీన్ వచ్చే సందర్భాన్ని బట్టి అభ్యంతరం ఉంటే ఓకేగానీ, స్కిన్ షో ఉండే అన్ని సీన్లను ఒకే గాటిన కట్టిపడేస్తే ఎలా? అని అంటున్నారు దర్శక నిర్మాతలు.

'ది ఎక్స్‌పోస్' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రంలో హిమేష్ రేషిమియా, హనీ సింగ్, జోయా అఫ్రోజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 60, 70ల్లో సినిమా పరిశ్రమ ఎలా ఉండేది అనే అంశాలను ఈ సినిమాలో చూపిస్తారట. ఈ చిత్రాన్ని మే 23వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Another upcoming movie has come under the scanner of The Censor Board of Film Certification (CBFC) as the board feels too much of skin is being exposed in the movie The Xpose.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu