హీరో మనోజ్ షాక్ : సన్నీ లియోన్ ఐటం సాంగ్ తీసేయమన్నారు!
హైదరాబాద్: మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘కరెంట్ తీగ' చిత్రం సెన్సార్ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సన్నీ లియోన్ ఐటం సాంగ్ సినిమా నుండి తీసేయాలని, అలా అయితేనే U/A సర్టిఫికెట్ ఇస్తామని తేల్చి చెప్పారట. అయితే సినిమాకు ప్రధాన ఆకర్షణ శృంగార తార సన్నీ లియోన్ ఐటం సాంగు కావడంతో దర్శక నిర్మాతలు, హీరో ససే మిరా అన్నారు. దీంతో ఈచిత్రానికి ‘A' సర్టిఫికెట్ జారీ అయింది.
ఈ విషయాలను హీరో మనోజ్ స్వయంగా వెల్లడించారు. సెన్సార్ బోర్డు అలా అనగానే షాక్ అయ్యాం. సన్నీ లియోన్ ఐటం సాంగ్ లేకుంటే సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. అందుకే ఆమె కోసం ‘A' సర్టిఫికెట్ తీసుకోవడానికి సిద్ధపడ్డామని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నిలియోన్ ప్రధాన పాత్రల్లో నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ‘కరెంట్ తీగ' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని దీపావళి కానుకగా ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. సినిమా గురించి దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ- చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టించి సూపర్‌హిట్‌గా నిలిచాయని, సన్నీలియోన్ అంటే కేవలం శృంగార నటి మాత్రమే కాదని, ఆమె ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించిందని, ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు సూపర్‌హిట్ అవుతుందని చెప్పడంతో పూర్తి నమ్మకంతో ఉన్నామని తెలిపారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని 17కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అన్నారు.
సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.


Click it and Unblock the Notifications











