twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంత్రుల జోక్యం: సెన్సార్ బోర్డ్ చీఫ్ రాజీనామా

    By Bojja Kumar
    |

    ముంబై: సినిమాలకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ జారీ చేసే విషయాల్లో కొందరు కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవడాన్ని నిరసిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డ్ చీఫ్ లీలా శాంసన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. డేరా సచ్చా సౌదా అధ్యక్షుడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సంబంధించిన వివాదాస్పద చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్' సెన్సార్ సర్టిఫికెషన్ విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది.

    Censor Board chief quits to protest MSG 'clearance'

    ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిపికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేంద్ర మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకుని సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. బోర్డు నిర్ణయాలపై మంత్రుల జోక్యాన్నినిరసిస్తూ లీలా శాంసన్ రాజీనామా ప్రకటించారు. బోర్డు విషయాల్లో మంత్రులు జోక్యం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, మంత్రిత్వ శాఖ నియమించిన సభ్యులు, అధికారుల అవినీతి.... వారి జోక్యం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు.

    లీలా సాంసన్ రాజీనామా ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆమె రాజీనామాకు ముందే ఈ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రాన్ని నిలిపి వేసారు. అయితే రాజీనామా విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని లీలా సాంశన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

    English summary
    There was no coercion or interference from the government to give a "clearance" to controversial film "Messenger of God" featuring Dera Saccha Sauda chief Gurmeet Ram Rahim Singh, Rajyavardhan Singh Rathore, junior minister in information and broadcasting ministry, said on Friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X