6 కట్స్ తో ఎన్టీఆర్ 'దమ్ము' సెన్సార్
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము సెన్సార్ పూర్తైంది. ఆరు కట్స్,కొన్ని డైలాగులు మ్యూట్ తో చిత్రానికి A సర్టిఫికేట్ ఇచ్చి సెన్సార్ ఓకే చేసారు. విజువల్ గా ఈ చిత్రంలో ఒక కట్ కూడా పడకపోవటం విశేషమని చెప్తున్నారు. అన్ని మైనర్ కట్స్ కావటంతో ఎన్టీఆర్,బోయపాటి శ్రీను చాలా హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ధియోటర్స్ ఎంపికల బిజీలో ఉన్న నిర్మాతలు భారీగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని చెప్తున్నారు. త్రిష,కార్తీక హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అలగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న చిత్రం విడుదల అవుతోంది.
ఇక ఈ చిత్రంలో విజువల్స్ అభిమానలును ఆనందపరుస్తాయని తెలుస్తోంది. అందుకోసం టీం ప్రత్యేక శ్రద్ద తీసుకుందని,కొన్ని సీన్స్ లో విజువల్స్ తెలుగు తెరపై అబ్బురపరిచేలా వచ్చాయాని ఇన్ సైడ్ టాక్ వినపడుతోంది. అలాగే బోయపాటి శ్రీను తో గతంలో భద్ర,తులసి,సింహా చిత్రాలుకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ఆర్ధర్ ఎ విల్సన్ ఈ చిత్రానికి కూడా పనిచేసారు. మాస్ యాంగిల్స్ లో హీరోని ఎలివేట్ చేయటంలో ఈ కెమెరామెన్ ని ప్రత్యేకమైన బాణి అని చెప్తూంటారు. ఈ విషయం ఈ చిత్రంతో మరోసారి రుజువు అవుతుందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ దమ్ము గురించి చెప్పే ప్రత్యేక శ్లోకం ..సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రం విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..ఎన్టీఆర్ కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు. అలాగే ఎన్టీఆర్ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు.
నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ...ఎన్టీఆర్ అభిమానుల అంచనాలను మించిపోయేలా ఈ చిత్రం ఉంటుంది. కథపై పట్టున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన ఈ చిత్రాన్ని మలిచిన విధానం చాలా బాగుంది. మా అబ్బాయి ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఒక గొప్ప చిత్రాన్ని తీశామన్న ఆనందం కలిగింది. ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. భానుప్రియ, నాజర్, సుమన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. రచన: ఎమ్.రత్నం, పాటలు: చంద్రబోస్, కెమెరా: ఆర్థర్ విల్సన్. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత. కె.ఎస్.రామారావు సమర్పకులు.


Click it and Unblock the Notifications











