Bhola Shankar: చిరంజీవి మూవీకి సెన్సార్ బోర్డు షాక్.. ఆ సీన్, డైలాగ్ కట్.. రిపోర్టుతో లీకైన ట్విస్ట్
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత మరింత ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. 'ఖైదీ నెంబర్ 150' తర్వాత ఆయన ఎన్నో సినిమాలతో వచ్చారు. కానీ, అందులో 'వాల్తేరు వీరయ్య' మాత్రమే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ జోష్‌లోనే ఇప్పుడు ఈ సీనియర్ స్టార్ 'భోళా శంకర్' అనే సినిమాతో రాబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు బిగ్ షాక్ ఇచ్చారు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

భోళా శంకర్‌గా మెగాస్టార్: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం ఇచ్చాడు. ఇది 'వేదాళం'కు రీమేక్‌గా రూపొందింది.

ప్రమోషన్స్.. ఈవెంట్‌తో: 'భోళా శంకర్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలను విడుదల చేశారు. వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మిగిలినవి కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఈరోజు (ఆగస్టు 6వ తేదీ) ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ నగరంలో జరుపుతున్న విషయం తెలిసిందే.

సెన్సార్ పూర్తి.. యూ/ఏ: క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భోళా శంకర్' చిత్రం రెండు రోజుల క్రితమే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వీక్షించిన తర్వాత సెన్సార్ సభ్యులు దీనికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఇక, ఈ చిత్రం 159.49 నిమిషాలు లేదా 2 గంటల 39 నిమిషాల 49 సెకెన్ల నిడివితో రాబోతుంది.

ఆ సూచనలు చేశారుగా: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీకి సెన్సార్ బోర్డు ఇచ్చిన రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆల్కాహాల్‌కు సంబంధించిన సీన్స్ వచ్చేప్పుడు 'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అనే వార్నింగ్‌ను బాగా హైలైట్ చేశారు. అలాగే, డ్రగ్స్ సీన్ సమయంలోనే ఇదే తరహా వార్నింగ్‌ను పెట్టించారు.

ఆ సీన్ కట్ చేసిన బోర్డు: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన ఓ సన్నివేశంపై సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఈ సీన్‌లో హీరో విలన్ తలను నరుకుతాడు. ఇది హింసాత్మకంగా ఉండడంతో ఆరు సెకెన్లు ఉన్న ఈ సన్నివేశాన్ని డిలీట్ చేశారు. దీని స్థానంలో హీరో, హీరోయిన్ క్లోజప్ షాట్‌ను యాడ్ చేసినట్లు రిపోర్టులో చూపారు.

ఆ డైలాగ్ కూడా లేపేసి: 'భోళా శంకర్' మూవీకి సంబంధించి ఇందులో వచ్చే 'బద్దల్ బాసింగాలు' అనే డైలాగును కూడా సెన్సార్ బోర్డు సభ్యులు మ్యూట్ చేయించారు. అంతేకాదు, సబ్‌టైటిల్స్ నుంచి దీన్ని డిలీట్ చేయించారు. అందుకోసమే ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు తెలిసింది. ఇక, తల నరికే సీన్ గురించి బయటకు రావడంతో పెద్ద ట్విస్ట్ రివీల్ అయినట్లైంది.


Click it and Unblock the Notifications











