twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన సెన్సార్ బోర్డు.. సమస్యల్లో ’దిశ ఎన్‌కౌంటర్’ మూవీ

    |

    వివాదాస్పద అంశాలు, సంఘటనలతో సినిమాలను తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇబ్బందుల్లో పడ్డారు. దిశ ఎన్‌కౌంటర్ ఆధారంగా తెరకెక్కించిన సినిమా విషయంలో ఆర్జీవికి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా లేదా అనే సందిగ్ధత వ్యక్తమవుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే...

    సంచలనంగా దిశ అత్యాచారం, హత్య

    సంచలనంగా దిశ అత్యాచారం, హత్య

    గతేడాది హైదరాబాద్ నగర శివారులో జరిగిన దిశ అనే యువతిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆ కేసులో నిందితులు పారిపోతుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం మరో సంచలనంగా మారింది.

    సెన్సార్ కత్తెర్లలో దిశ ఎన్‌కౌంటర్

    సెన్సార్ కత్తెర్లలో దిశ ఎన్‌కౌంటర్

    దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కథా నేపథ్యంగా రూపొందించిన దిశ ఎన్‌కౌంటర్ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కత్తెరలో చిక్కుకున్నది. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికెట్ ఇవ్వాలా? వద్దా అనే మీమాంసలో మునిగిపోయినట్టు సమాచారం.

    కొన్ని సీన్లపై అభ్యంతరాలు?

    కొన్ని సీన్లపై అభ్యంతరాలు?

    మీడియా కథనాల ప్రకారం... దిశ ఎన్‌కౌంటర్ సినిమాకు సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలు తొలగిస్తే కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదురుతుందని తేల్చి చెప్పినట్టు సమాచారం.

    దిశ మూవీలో సీన్లపై కత్తెర

    దిశ మూవీలో సీన్లపై కత్తెర

    తాజా సమాచారం ప్రకారం.. దిశ సినిమాలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సన్నివేశాలను యధావిధిగా తెరకెక్కించడంపై సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఈ విషయానికి సంబంధించి మూవీ యూనిట్ వర్గాలు క్లారిటీ ఇస్తే.. ఈ వివాదానికి చెందిన అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదు.

    రివిజన్ కమిటీకి దిశ ఎన్‌కౌంటర్

    రివిజన్ కమిటీకి దిశ ఎన్‌కౌంటర్

    దిశ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన సెన్సార్ బోర్డు అధికారులు నిరాకరించడంతో ఈ సినిమా ఇక రివిజన్ కమిటీ ముందుకు వెళ్లనున్నది. రివిజన్ కమిటీ సభ్యులు సినిమా చూసిన తర్వాత వారు తీసుకొనే నిర్ణయం బట్టే సినిమా రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

    English summary
    Censor board gives shock to Ram Gopal Varma over Disha Encounter Movie. As per media reports, Officials of Censor rejected certificates to Disha encounter movie. They objected few scenes picturised in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X