దొంగతనం కేసులో సెన్సార్‌ బోర్డు సభ్యురాలి అరెస్టు

By Srikanya

Censor Board member held for stealing colleague's jewellery
ముంబయి: సెన్సార్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యురాలిని దొంగతనం కేసులో మెరైన్‌ డ్రైవ్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ కెమేరా ఫుటేజీ సాయంతో ఈమె దొంగతనం బయటపడింది. సెన్సార్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యురాలు మీనాక్షి సింగ్‌ (59) రూ.5.25 లక్షల బంగారు నగలను దొంగలించింది. ఈ నెల నాలుగున దక్షిణ ముంబయిలోని ఎరోస్‌ థియేటర్‌లో భోజ్‌పురి సినిమా చూసేందుకు వచ్చిన మీనాక్షి సింగ్‌ తన సహచరి కిరణ్‌ శ్రీవాస్తవ్‌కు చెందిన ఆభరణాలను అపహరించిందని పోలీసులు తెలిపారు. కిరణ్‌ వాష్‌ రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆమె పర్సులోని ఆభరణాలను మీనాక్షి దొంగిలించినట్లు వివరించారు.

వివరాల్లోకి వెళితే... కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలు ఒకరు తన సహోద్యోగిని ఆభరణాలను అపహరించి....పోలీసులకు దొరికిపోయారు. ఈనెల నాలుగోతేదీన జరిగిన ఈ దొంగతనం వివరాలను పోలీసులు శనివారం నాడిక్కడ వెల్లడించారు. మీనాక్షి సింగ్‌ అనే సెన్సారు బోర్డు సభ్యురాలు తన సహోద్యోగిని అయిన కిరణ్‌ శ్రీవాత్సవతో కలిసి ఒక భోజ్‌పురి చిత్రాన్ని నాలుగో తేదీన సెన్సార్‌ చేస్తున్నారు. ఒక మినీథియేటర్‌లో ఈ కార్యక్రమం నడుస్తుండగా...తన పక్కనే ఉన్న కిరణ్‌ బ్యాగులో నుంచి మీనాక్షి చాకచక్యంగా వజ్రాభరణాలను తస్కరించేశారు.

చలనచిత్రం సెన్సారు పని పూర్తయిన తర్వాత బ్యాగులో చూసుకున్న కిరణ్‌కు తన ఆభరణాలు పోయినట్లు తెలిసింది. వెంటనే ఆమె మీనాక్షి...మరో ముగ్గురు సభ్యులతో కలిసి అక్కడంతా వెతికారు. ఫలితం లేకపోయింది. ఇంట్లో ఏమైనా మర్చిపోయానేమోనని ఇంటికెళ్లి చూసినా దొరకలేదు. దీంతో, కిరణ్‌ సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సినిమా సెన్సారు జరిగిన మినీథియేటర్‌లోని సీసీటీవీ దృశ్యాల్లో మీనాక్షి అనుమానాస్పద కదలికలను గమనించిన పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించారు. చేసిన తప్పును మీనాక్షి అంగీకరించారు. ఆమె నివాసం నుంచి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన మీనాక్షికి బెయిలు లభించినట్లు పోలీసులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X