twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మోదీ’ సినిమానా? అయినా ఒప్పుకోం.. సెన్సార్ బోర్డు షాక్

    మోదీ అభివృద్ధి ఎజెండా నేపథ్యంతో రూపొందిన ‘మోదీ కా గావ్’ అనే చిత్రాన్ని సురేశ్ ఝా నిర్మించగా తుషార్ ఏ గోయల్ దర్శకత్వం వహించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఈ చిత్రాన్ని విడుదల చేయ

    By Rajababu
    |

    ప్రధాని నరేంద్రమోదీ జీవితంలోని కీలక అంశాల ఆధారంగా నిర్మితమైన చిత్రాన్ని అడ్డుకొంటుందని ఆ చిత్ర నిర్మాతలు సెన్సార్డ్ బోర్డు తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అభివృద్ధి ఎజెండా నేపథ్యంతో రూపొందిన 'మోదీ కా గావ్' అనే చిత్రాన్ని సురేశ్ ఝా నిర్మించగా తుషార్ ఏ గోయల్ దర్శకత్వం వహించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఈ చిత్రాన్ని విడుదల చేయలేమని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను నిరాకరించింది. సెన్సార్ బోర్డు నిర్ణయంపై నిర్మాత ఝా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

     విడుదలకు సెన్సార్ బోర్డు నో

    విడుదలకు సెన్సార్ బోర్డు నో


    ఈ చిత్రంలో ప్రధానంగా మూడు అభ్యంతరాలను సెన్సార్ బోర్డు లేవనెత్తింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాను. అవసరమైతే విడుదల కోసం కోర్టును ఆశ్రయిస్తాం. ప్రధానమంత్రి కార్యాలయం, ఎన్నికల కమిషన్ అనుమతి తెచ్చుకోమని బోర్డు చెబుతున్నది. వారి నుంచి ఎన్‌వోసీ తెచ్చుకంటే సెన్సార్ బోర్డు ఎందుకు. ఇంతకంటే ఘోరమేమైనా ఉంటుందా అని నిర్మాత ఝా ఆవేదన వ్యక్తం చేశారు.

     విడుదల చేస్తే ఎన్నికల్లో ప్రచారం

    విడుదల చేస్తే ఎన్నికల్లో ప్రచారం


    ‘ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్నివిడుదల చేయడం కుదరదు. ఒకవేళ విడుదల చేస్తే ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగపడుతుంది. ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర మోదీని పోలి ఉన్నది. అందుకే సర్టిఫికెట్ ఇవ్వడం లేదు' అని సెన్సార్ బోర్డు తెలిపింది.

     ప్రధాని మోదీల ఉన్నందుకు గర్వంగా ఉంది

    ప్రధాని మోదీల ఉన్నందుకు గర్వంగా ఉంది


    అచ్చు ప్రధాని మోదీలా ఉన్నందుకు గర్వంగా ఉంది. ఒకవేళ ఓ అవినీతి నేతగా ఉంటే కచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకొనే వాడిని అని వికాస్ మహంతే తెలిపారు. వృత్తిపరంగా ఈయన ముంబైలో వ్యాపారవేత్త. ప్రధాని మాదిరిగా ఉండటం, దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో మోదీని అనుకరిస్తూ మాట్లాడేలా సాధన చేస్తున్నారు.

     ముంబైలో మోదీకి విశేష ప్రజాదరణ

    ముంబైలో మోదీకి విశేష ప్రజాదరణ


    వికాస్ మహంతేకు ముంబైలో విశేష ప్రజాదరణ ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పప్పు బీహారీ అనే పదాన్ని, ఓ పాటను తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించింది.

    English summary
    Censor board sought NOC from the EC for Modi Ka Gaon movie. Censor board said, As elections are going on in various parts of the country so we could not give the certificate for film. The film can be treated as promotional material for political campaigns.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X