జై బోలో తెలంగాణ సినిమాకు సెన్సార్ చిక్కులు
ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన జై బోలో తెలంగాణ సినిమాకు సెన్సార్ చిక్కులు ఎదురవుతున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెబుతోంది. ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలని శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే సెన్సార్ చిక్కులతో ఈ సినిమా ఆ తేదీన విడుదల కావడంపై నీలినీడలు అలుముకున్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఓ ప్రాంతం ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని అంటున్నారు.
సెన్సార్ బోర్డు తీరుపై తెలంగాణవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. సినిమాకు అడ్డంకులు కల్పించడం సమైక్యావాదుల కుట్రగా అభివర్ణిస్తున్నారు. మళ్లీ సినిమాపై సెన్సార్ బోర్డు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. హింసను ప్రేరేపించే విధంగా, అసందర్భ సన్నివేశాలు ఉన్న రక్తచరిత్ర వంటి సినిమాలకు పచ్చజెండా ఊపుతున్న సెన్సార్ బోర్డు అధికారులు ఉద్యమ సినిమాకు అభ్యంతరం చెప్పడం కుట్రేనని అంటున్నారు.


Click it and Unblock the Notifications











