చిక్కుల్లో ‘D/O రామ్ గోపాల్ వర్మ’

By Bojja Kumar

హైదరాబాద్ : వెన్నెల కిషోర్ హీరోగా రూపొందుతున్న మరో చిత్రం 'D/o రామ్ గోపాల్ వర్మ'. నాటక రంగలో 9 నంది వార్డులు పొందిన ఖాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈచిత్రంలో నవీన జాక్సన్, ఆరాస్ పిమేల్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ ఫిలింస్ బేనర్ పై బొక్కా నరేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈచిత్రం సెన్సార్ బోర్డు నుంచి చిక్కులు ఎదుర్కొంటోంది. ఈ చిత్రం టైటిల్ మార్చాలని బోర్డు సభ్యులు ఆదేశించినట్లు సమాచారం. ఈ దీంతో టైటిల్ 'D/o వర్మ' గా మార్చే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు పెట్టడం వల్ల ఫిర్యాదులు వస్తాయనే కారణంతో సెన్సార్ బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేసారు.

సినిమా కథ విషయానికిస్తే...ఓ సెల్రబిటీ తండ్రి, కూతుర్ల మధ్య సాగే కథే ఈ సినిమా. చాలా ఫన్నీగా సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సినిమా టైటిల్ పట్ల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఖాజా స్పష్టం చేసారు.

ఈ చిత్రంలో ఇంకా...రోజా, జీవా, మేల్కోటి, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, ఫిష్ వెంకటేష్ తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక విభాగంలో....సంగీతం : ఆద్వేష్ రవి, లిరిక్స్ : సురేష్, బాలు, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రాఫర్ : పి.జి. విందా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మన్నె శ్రీనివాస్, ప్రొడ్యూసర్ : బొక్కా నరేంద్ర రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ఖాజా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X