సన్నీలియోన్ ‘జిస్మ్-2’కు సెన్సార్ బోర్డ్ షాక్
నీలి చిత్రాల తార, ఇండో కెనడియన్ సన్నీలియోన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'జిస్మ్-2' చిత్రానికి సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. ఈ చిత్రంలో తీవ్రమైన అభ్యంతరకర సన్నివేశాలు బోలెడు ఉన్నాయని, అలాంటి సీన్లు 50% తొలగిస్తేనే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేస్తామని షాకిచ్చింది. సెన్సార్ బోర్డు ఆ రేంజిలో అభ్యంతరం వ్యక్తం చేసిదంటే ఈ చిత్రంలో ఎన్ని బూతు సీన్లు ఉన్నాయో అని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
అసలు ఈ చిత్రం తీసిందే ఫోర్న్ స్టార్ సన్ని లియోన్‌పై హాట్ హాట్, ఘాటు ఘాటు శృంగార సన్నీ వేశాలు చిత్రీకరించి సొమ్ము చేసుకోవాలనే ప్రధాన లక్ష్యంతో. సినిమాకు కాసులు కురిపించే ఆ మషాలా సీన్లకు సెన్సార్ బోర్డు నో చెప్పడంతో ఈ చిత్ర దర్శకురాలు పూజా భట్ ఏం చేయాలో తోచని అయోమయంలో పడింది. ఆగస్టు 3న ఈచిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు గతంలోనే ప్రకటించారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి.
పూజాభట్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











