twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పద్మావతి'కి సెన్సార్ బిగ్ షాక్: క్లియరెన్స్ ఇచ్చినట్లే ఇచ్చి!..

    |

    Recommended Video

    'పద్మావతి'కి సెన్సార్ బిగ్ షాక్..

    దేవుడు ఉన్నాడా? లేడా?.. అన్న ప్రశ్నకు ఎవరి సమాధానాలు, నమ్మకాలు వారికి ఉన్నాయి. శాస్త్రీయపరంగా అదంతా వట్టి కాల్పనికత అనిపించవచ్చు. కానీ భారతదేశం లాంటి సాంప్రదాయిక దేశంలో నమ్మకాలదే పైచేయి.

    ఒక నమ్మకం బలంగా నాటుకుపోయిన తర్వాత దాని నుంచి బయటపడటం చాలా కష్టం. పైపెచ్చు.. ఆ నమ్మకాన్ని తప్పుపట్టేవాళ్లు ద్రోహులుగా కనిపించవచ్చు. 'పద్మావతి' అనే సినిమా ఇందుకు తాజా ఉదాహరణ.

    'పద్మావతి' కాల్పనిక పాత్ర అని సినిమావాళ్లు.., కాదు.. మా హిందూ రాణి అని రాజ్‌పుత్ కర్ణీ వర్గం వాదించుకుంటూ వస్తున్నారు. ఇన్ని వివాదాల నడుమ ఎట్టకేలకు సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు క్లియరెన్స్ వచ్చింది. కానీ ఇక్కడే సెన్సార్ ఓ మెలిక పెట్టింది..

    యు/ఏ సర్టిఫికెట్:

    యు/ఏ సర్టిఫికెట్:

    గురువారం జరిగిన ప్రత్యేక ప్యానెల్‌ సమీక్షా సమావేశం తర్వాత సెన్సార్ బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. తమ ప్రతిపాదనలకు ఒప్పుకుంటే యు/ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పింది. ఇంతకీ ఏంటా షరతులు..

    కానీ షరతులు..:

    కానీ షరతులు..:

    చిత్ర టైటిల్‌ను పద్మావత్‌(Padmavat)గా మార్చడంతో పాటు.. 26సీన్లను తొలగించడానికి ఒప్పుకుంటే సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికి తాము సిద్దమని ప్రకటించింది. అంతేకాదు, సినిమా ప్రారంభానికి ముందు జారీ చేసే ప్రకటనల విషయంలోనూ ప్యానెల్‌ షరతులు విధించినట్లు సమాచారం.

     తుది నిర్ణయం?..:

    తుది నిర్ణయం?..:

    సెన్సార్ నిర్ణయానికి 'పద్మావతి' చిత్ర యూనిట్ సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే మరో దఫా సమావేశం తర్వాతనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

     అసలేంటీ వివాదం:

    అసలేంటీ వివాదం:

    పద్మావతి వివాదానికి మూల కారణం ఈ సినిమా కథ. సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లలో ముస్లిం రాజు ఖిల్జీ.. హిందూ రాణి పద్మావతి గురించి కొన్ని శృంగారపరమైన కలలు కంటాడనే ప్రచారం జరిగింది. దీనిపై అభ్యంతరం లేవనెత్తుతూ సినిమాను ఆపేయాల్సిందిగా రాజ్‌పుత్ కర్ణీ సేన చిత్ర యూనిట్ పై దాడికి దిగింది.

     తల నరుకుతామని:

    తల నరుకుతామని:

    సంజయ్‌ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకునేల తల నరికిన వారికి రూ. 10 కోట్ల బహుమతి ఇస్తానని హరియాణా బీజేపీ చీఫ్‌ వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆ తర్వాత హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తామని కూడా కొంతమంది హెచ్చరించారు.

    కాల్పనిక పాత్రేనా?:

    కాల్పనిక పాత్రేనా?:

    పద్మావతి అనే పాత్రపై రకరకాల ప్రచారాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అవధ్‌ ప్రాంతానికి చెందిన సూఫీ సంత్‌ మాలిక్‌ మహ్మద్‌ జాయసీ 540లో 'పద్మావత్‌' పేరుతో కథ రాశారు. ఇందులో సింహళ దేశ రాజకుమారిగా పద్మావతి ప్రస్తావన ఉంది. అత్యంత అందమైన రాణిగా చెప్పబడే ఈమెను..రాజస్తాన్‌లోని చితోడ్‌గఢ్‌ రాజు రతన్‌సేన్ పెళ్లాడతాడు. సింహళ రాజ్యంపై దండెత్తి.. ఆ రాజ్యాన్ని ఓడించిన తర్వాత ఆమెను తీసుకుని చితోడ్ గడ్ వస్తాడు.

     ఖిల్జీతో సంబంధం ఏంటి?:

    ఖిల్జీతో సంబంధం ఏంటి?:

    అప్పటికీ ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతుంటాడు. అలాంటి తరుణంలో చితోడ్ గడ్ రాజ్యం నుంచి బహిష్కరించబడ్డ ఓ బ్రాహ్మణుడు ఖిల్జీతో చేతులు కలుపుతాడు.

    పద్మావతి అందం గురించి చెప్పి ఖిల్జీని రెచ్చగొడుతాడు. అలా ఖిల్జీ చితోడ్‌గడ్‌పై దండెత్తి రతన్‌సేన్ రాజ్యాన్ని ఓడిస్తాడు. ఆ పోరులో రతన్ సేన్ మరణిస్తాడు కూడా. ఆ తర్వాత పద్మావతిని సొంతం చేసుకునేందుకు.. ఖిల్జీ కోటలోకి ప్రవేశించగా.. అప్పటికే ఆత్మార్పణం చేసుకున్న పద్మావతి చితి కనిపిస్తుంది.

    ఏది నిజం?..:

    ఏది నిజం?..:

    జాయసీ కథ నిజమా? కాదా? అన్న విషయంలో అనేక వాదనలున్నాయి. చాలామంది చరిత్రకారులు, ప్రొఫెసర్లు దీన్ని కొట్టిపడేస్తున్నారు. చరిత్ర ప్రకారం ఖిల్జీ చితోడ్‌గఢ్‌పై దండెత్తి రతన్‌ సేన్‌ను 1303లో ఓడించాడు. 1316లో చనిపోయాడు. కానీ ఆ కాలంలో పద్మావతి పేరుతో రాణి ఎవరూ లేరన్నది వారి వాదన. కానీ రాజ్‌పుత్‌లు మాత్రం ఈ పాత్రను నిజమని నమ్ముతున్నారు.

    English summary
    Sanjay Leela Bhansali's film 'Padmavati', will get a U/A certificate, The board has suggested 26 cuts to the film and a change in the title to 'Padmavat' - and will issue the certificate once the modifications are made.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X