అదిరిందికి సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. 27న రిలీజ్
మెర్సల్ వివాదాల మధ్య నలుగుతున్న నేపథ్యంలో తెలుగు వెర్షన్ అదిరింది సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదిరింది సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్టు సమాచారం.
మెర్సల్ వివాదాల మధ్య నలుగుతున్న నేపథ్యంలో తెలుగు వెర్షన్ అదిరింది సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదిరింది సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్టు సమాచారం. దాంతో అదిరింది చిత్ర రిలీజ్‌కు మార్గం సుగమమైంది. వాస్తవానికి ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ పనులు పూర్తి కాకపోవడంతో మెర్సల్ రిలీజ్ వాయిదా పడింది.

అదిరింది చిత్రాన్ని అక్టోబర్ 27న (శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లోను చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ సమర్పిస్తున్నారు. కాజల్, సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా, జీఎస్టీ విధానాలపై ధ్వజమెత్తేలా ఉండటంతో వివాదం నెలకొన్నది.


Click it and Unblock the Notifications











