twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎట్టకేలకు పని పూర్తిచేసిన బెల్లంకొండ, కాజల్.. ఇక రావడమే తరువాయి

    |

    బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జోడీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. అదేంటనేది పక్కన బెడితే ఈ ఇద్దరూ జోడీ కట్టారంటే సినిమాకు మంచి పాపులారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే దాన్ని క్యాచ్ చేసుకుంటూ డైరెక్టర్ తేజ ఈ ఇద్దరి రొమాన్స్‌ని దగ్గరుండి నడిపించారు. ఏంటి.. అర్థం కాలేదా? అదేనండీ మనం చెప్పుకునేది 'సీత' సినిమా గురించే!

    అప్పట్లో వరుస సినిమాలతో తెలుగు సినిమా ట్రెండ్ మార్చేసి కొత్త జోష్ తీసుకొచ్చారు డైరెక్టర్ తేజ. అయితే 'నిజం' సినిమా తర్వాత ఆయనకు ఆశించిన మేర కలిసి రాలేదు. దీంతో గ్యాప్ తీసుకున్న తేజ.. 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ రీ ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా 'సీత' సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

    censor completed for Sita

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'సీత' దేశ విశేషాల్లోని పలు అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా సెన్సార్ పరీక్షకు వెళ్లిన సీత తాజాగా యూ/ ఏ సర్టిఫికెట్ పొందింది. చిత్ర నిడివి 161 నిమిషాల 22 సెకనులు ఉండనుంది. మే 24 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    చిత్రంలో కాజల్ డిఫెరెంట్ షేడ్‌లో పొగరుబోతు పాత్రలో కనిపించనుంది. కాజల్ గతంలో ఏ సినిమాలో ఈ తరహా పాత్ర చేయకపోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది ప్రేక్షకుల్లో. ఇక ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. డైరెక్టర్ తేజ, హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ కాజల్ ఈ సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే విడుడల కానున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు.

    English summary
    Director Teja's upcoming movie 'Sita'. Sai Srinivas Bellamkonda, Kajal Aggarwal playing lead roles in this romantic drama. This movie passed in censor and certified U/A.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X