అల్లు అర్జున్ 'వేదం' చిత్రంలో సెన్సార్ కట్స్
క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మనోజ్ మంచు, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన 'వేదం' జూన్ 4న రిలీజైంది. ఈ చిత్రాన్ని 5గురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి 7 కట్స్ తో 31-5-2010న 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది. ఆర్కామీడియా పతాకాన దేవినేని ప్రసాద్ యార్లగడ్డ శోభు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కట్స్ ఇవే.
1. అయిదవ రీలులో చిత్రీకరించిన 'అబ్బ ఇక్కడ మనం సెకండరీ సిటిజన్. ఏం జరిగినా మన వైపే చూస్తారు ప్రతివాడి కళ్ళలో అనుమానం' డైలాగ్ ని తొలగించి ఆ స్థానంలో అనుమతి పొందిన "అబ్బా ఇక్కడ నాకు ప్రశాంతతలేదు" అని ఉంచడానిని అంగీకరించారు గాని శబ్దం వినబడకూడదన్నారు.
2. ఏడవ రీలులోని 'చిన్నప్పటినుంచీ ట్రయినింగ్ ఇప్పించడం టెర్రరిస్టులుగా చెయ్యడం' అనే డైలాగ్ ని తొలగించి ఆ పదాలు వినబడకూడదన్నారు.
3. ఏడవ రీలులో మరోచోట 'ఆడమగ పెళ్ళికి ముందు తిరగడం....నుంచి...కట్టవే కట్టు' వరకు చిత్రీకరించిన డైలాగ్ ని తొలిగిస్తూ సౌండ్ వినబడకుండా ఆంక్షలు విధించారు.
4. తొమ్మిదవ రీలులో 'లం' పదాన్ని సౌండ్ ని తొలగించారు.
5. తొమ్మిదవ రీలులో చిత్రీకరించిన 'దొరికిన ప్రతి టెర్రరిస్ట్ మీ వాళ్లే అవుతారు'కి బదులుగా "వీళ్ళకి సంబంధం వుందని నాకు క్లియర్ గా తెలుసు..చెప్పండిరా" అని అంగీకరించిన డైలాగ్ జొప్పించడానికి అంగీకరించి శబ్దం వినబడకూడదన్నారు.
6. పన్నెండవ రీలులో 'యే ఆగ్ అల్లా కేలియే ఇస్తామాల్ కర్' అనే డైలాగ్ స్థానంలో 'యే జీహాద్ కేలియే' వుంచడానికి అంగీకరించి శబ్దం వినబడకూడదన్నారు.
7. 'మీరంతా ఇంతేరా' పోలీస్ అన్న పదాలుకు బదులుగా అంగీకార యోగ్యమైన 'మీరంతా ఇంతేనర్రా' ఉంచి, సౌండ్ వినబడకుండా వుండాలని, చిత్రంలో ఇది ఎక్కడ వచ్చినా వర్తిస్తుందని సూచించారు.
14 రీళ్ళ నిడివితో రిలీజైన ఈ చిత్రం మంచి టాక్ నే తెచ్చుకుంది. ఓపినింగ్స్ సైతం బాగా తెచ్చుకుని మంచి ప్రయోగానికి ప్రేక్షకులు ఎప్పుడూ తోడుంటారని నిరూపించింది.


Click it and Unblock the Notifications











