సమంత-సిద్ధార్థ ‘జబర్‌దస్త్’ సెన్సార్ కట్స్ ఇవే..

By Bojja Kumar

హైదరాబాద్: సిద్ధార్థ-సమంత జంటగా నటిస్తున్న 'జబర్‌దస్త్' మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని... U/A సర్టిఫికెట్ పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చింది. అందులో ఏయే సీన్లకు, డైలాగులు సెన్సార్ అధికారులు కత్తెర వేసారో ఓ లుక్కేద్దాం.

సెన్సార్ కట్స్..
1. సినిమాలో గుర్రం కనిపించే సన్నివేశాలు తొలగించాలి. లేదా 'యానిమల్ వెల్ఫేర్ బోర్డ్' నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి.

2. మద్యపానం, ధూమపానం సన్నివేశాలపై చట్టబద్దమైన హెచ్చరికలు జారీ చేయాలి. అదే విధంగా ఈ రెండు ఆరోగ్యానికి హానికరమంటూ చెప్పాలి.

3. సినిమా డైలాగుల్లో..... లంచం తీసుకున్న న్యాయమూర్తి పాపాలు, మోసం చేసిన కల్కి, నిత్యానంద స్వామి, మాయావతి పదాలను డిలీట్ చేయ్యాలి.

4. 'అల్లా అల్లా' సాంగులో.... 'అల్లా అల్లా' పదాలను తొలగించి ఆ స్థానంలో 'హల్లా గుల్లా' అనే పదాలతో రీప్లేస్ చేయాలి.

ఫిబ్రవరి 22న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'అలా మొదలైంది' ఫేం నందినీరెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నండగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. అలా మొదలైంది చిత్రాన్ని యూత్ అండ్ ఫ్యామిలీ మెచ్చేలా వినోదాత్మకంగా తెరకెక్కించిన దర్శకురాలు నందినీరెడ్డి 'జబర్‌దస్త్' చిత్రాన్ని మాస్ మసాలా అంశాలతో తెరకెక్కించారు.

ఈ చిత్రంలో సిద్ధార్థ పాత్ర విభిన్నంగా ఉండటంతో మంచి కామెడీ టైమింగుతో ఉంటుంది. అదే విధంగా హీరోయిన్ సమంత పాత్ర రౌడీలా ఉంటుందట. ఈ విషయాలు స్వయంగా దర్శకురాలు నందినీ రెడ్డి వెల్లడించారు. మొత్తానికి ఈచిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది అంటున్నారు. సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి .మహేంద్రబాబు, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.వి.నందిని రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X