ఇంకా సెన్సార్ కోరల్లో అదిరింది.. 27న రిలీజ్ వాయిదా?
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన మెర్సల్ చిత్రం ఓ వైపు వివాదాల్లో కూరుకుపోగా, తెలుగు వెర్షన్ అదిరింది చిత్రానికి సెన్సార్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ చిత్రానికి ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ విడుదల చేయకపోవడం
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన మెర్సల్ చిత్రం ఓ వైపు వివాదాల్లో కూరుకుపోగా, తెలుగు వెర్షన్ అదిరింది చిత్రానికి సెన్సార్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ చిత్రానికి ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ విడుదల చేయకపోవడంతో అక్టోబర్ 27న (శుక్రవారం) అదిరింది రిలీజ్ ప్రశ్నార్థకంగా మారింది. విడుదలకు ముందే అదిరింది చిత్రం వివాదంలో కూరుకుపోవడం సినీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది.

అదిరింది రిలీజ్ కష్టమే
తాజా సమాచారం ప్రకారం శుక్రవారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు ప్రదర్శించే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ జారీ చేస్తే శుక్రవారం (27న) ఫస్ట్ షో గానీ, సెకండ్ షో గానీ ప్రదర్శించే అవకాశం ఉంది. లేదా శనివారం రిలీజ్ ఛాన్సు కనిపిస్తున్నది.

డైలాగ్స్ మ్యూట్ చేసేందుకు..
అదిరింది చిత్రానికి సెన్సార్ ఇబ్బందులు ఎక్కువ కావడంతో చిత్ర యూనిట్ డైలాగ్స్‌ను మ్యూట్ చేసినట్టు తెలుస్తున్నది. అయినా రాత్రి 8 గంటల వరకు కూడా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

చివరి వరకు వేచిచూస్తాం
అదిరింది చిత్రాన్ని తెలుుగులో విడుదల చేయడానికి చివరి వరకు వేచి చూస్తాం. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ అందకపోతే రిలీజ్ కష్టమే. ఈ చిత్రంలో జీఎస్టీ, డిజిట్ ఇండియా, ప్రభుత్వాల పనితీరుపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయనే వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

డైలాగ్స్ మ్యూట్ చేయండి
జీఎస్టీకి వ్యతిరేకంగా అదిరింది చిత్రంలో ఉన్న డైలాగ్స్‌ను వినిపించకుండా (మ్యూట్) చేయాలని సినీ నిర్మాత, దర్శకులకు సెన్సార్ బోర్డు షరతు విధించిందట. సెన్సార్ బోర్డు అధికారుల సూచన మేరకు తగిన చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం.

200 కోట్ల క్లబ్‌లో మెర్సల్
వివాదం నడుమ తమిళంలో మెర్సల్ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది. ఆరు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే దాదాపు 170 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











