twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సారీ టీచర్’వివాదంపై సెన్సార్ అధికారి వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహిళల వ్యక్తిత్వాన్ని దిగజార్చే, గురువులను అగౌరవ పరిచే పద్ధతుల్లో ఉన్న 'సారీ టీచర్‌' సినిమాను వెంటనే నిలిపివేయాలని, అశ్లీల పోస్టర్లను తక్షణం తొలగించాలని ఆ మధ్యన వివాదం చెలరేగింది. అలాగే ఈ చిత్రం సెన్సార్ ఎలా ఇచ్చారంటూ కూడా సెన్సార్ పై మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. ఈ నేఫధ్యంలో.. ప్రాంతీయ ఫిలిం సెన్సార్ బోర్డు అధికారి ఎ.ధనలక్ష్మి మీడియాతో మాట్లాడారు.

    ఆమె మాట్లాడుతూ...ప్రస్తుతం వివాదం నడుస్తూ కోర్టు పరిధిలో ఉన్న 'సారీ టీచర్' సినిమాను ముంబైలో సెన్సారుకు దరఖాస్తు చేశారు. మా వద్ద తెలుగు సభ్యులు లేరని అక్కడి వారు ఏపీకి పంపిస్తే... అప్పటి రీజినల్ ఆఫీసర్ తిరస్కరిస్తే.. మా సినిమాలో సోషల్ మెసేజ్ ఉందని అప్పీలు చేశారు. ఆపై మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకే యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేశాం అన్నారు.

    అలాగే ''సెన్సారు బోర్డు నిబంధనలను కఠినంగా అమలు చేసే విషయంలో ఎక్కడా రాజీ పడం. చిన్నా,పెద్ద నిర్మాతలన్న తేడా మాకు లేదు.ప్రతి సినిమాను చూసిన అర్ధగంటలో సభ్యులతో పాటు మేము మా అభ్యంతరాలు, సూచనలను నిర్మాతలకి చెప్పేస్తున్నాము. మేము చేసిన సూచనలతో వచ్చే సినిమాలను చూసి 48 గంటల్లోగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాం. మా వద్ద నమోదయ్యే సినిమాలను సీరియల్ పద్దతిలోనే చూసి, సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాం. థియేటర్ల కొరత ఉన్నా రోజుకు సగటున రెండు నుండి ఐదు సినిమాలు చూసి క్లియర్ చేస్తున్నాం. అన్నారు.

    'సారీ టీచర్'కు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చామని.. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. పోస్టర్లలో దృశ్యాలు బాగాలేని పక్షంలో ఫిర్యాదుదారులు జిల్లా కోర్టులకు వెళ్లవచ్చని సూచన చేశారు.పోస్టర్లలో అసభ్యత ఉంటే తామూ పోలీసులకే ఫిర్యాదు చేస్తామని వివరించారు. యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అంటే, దాని ఉద్దేశం.. 12 ఏళ్ల లోపు పిల్లలు చూడాలో వద్దో వారితల్లిదండ్రులే నిర్ణయించుకోవాలని చెప్పడమని వివరించారు. ఆ సినిమా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు, మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా ఉందనడాన్ని, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందన్న వాదనను సెన్సార్ బోర్డు కొట్టి పారేసింది.

    ఆర్యమన్, కావ్యాసింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సారీ టీచర్'. సూర్యలోక్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆనంద్ నిర్మిస్తున్నారు. శ్రీసత్య దర్శకుడు.

    English summary
    Dhanalakshmi , censor Board regional officer clarify about Sorry teacher film. Director Sri Satya's upcoming Telugu movie Sorry Teacher, which stars Aryaman and Kavya Singh in leads, is facing the wrath of teachers. But censor board green signal to 'Sorry Teacher' movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X