సోనియా గాంధీ ఫర్మిషన్ తో రిలీజ్ ?
సోనియా గాంధి జీవిత చరిత్రగా పాపులరై తెరకెక్కిన సోనియా చిత్రం సెన్సార్ తో రెండేళ్ళ నిరవధిక పోరాటం చేసి ఎట్టకేలకు విడుదలకు రెడీఅవుతోంది. మాంటేజ్ ఇంటర్నేషనల్ మరియు దాస్ ఎంటరటైనమెంట్ పతాకంపై డైరక్టర్ టి.డి.కుమార్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ తొమ్మిదిన రిలీజ్ కాబోతుంది. అయితే సెన్సార్ బోర్డ్ ఫైనల్ గా సోనియా ఫర్మిషన్ తీసుకుని రిలీజ్ చేయమని ఆదేశించిందిట.
అయితే ఫర్మిషన్ కోసం వెళితే రిలీజ్ అవటం అనేది తమ చేతిలో ఉండదని భావించిన దర్శక,నిర్మాతలు ముంబై హైకోర్ట్ లో పిటీషన్ ఫైల్ చేసారు. సినిమా ఫొటో గ్రఫి చట్టం ప్రకారం సెన్సార్ అయిన చిత్రం రిలీజ్ కి పర్శనల్ గా ఎవరి ఫర్మిషన్ తీసుకోవాల్సిన పనిలేదని, సెల్ఫ్ ఎక్సప్రెషన్ అనేది ప్రాధమిక హక్కు అని దానికి ఎవరూ అడ్డుపెట్టాల్సిన పనిలేదని తీర్పు వచ్చిందిట. ఇక దర్శకుడు సోనియా సినిమా గురించి చెబుతూ ఈ సినిమా సోనియా గాంధి పై విమర్శనాత్మక చిత్రమేమీ కాదంటున్నాడు.
మరి సెన్సార్ తో తలనొప్పి ఏమిటంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే అంటున్నాడు. ఇంతకీ డిసెంబర్ తొమ్మిది ...సోనియా పుట్టినరోజుట. అందుకే ఆ రోజు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారుట. అంటే మళ్ళీ సంభంధం లేదంటూ మడతేస్తున్నారనేగా అని సోనియా అభిమానులు మండిపడుతున్నారు. అసలింతకీ ఆ సినిమాలో సోనియా గురించి ఏమైనా ఉందో లేదో తెలియాలంటే డిసెంబర్ దాకా ఆగాల్సిందే...


Click it and Unblock the Notifications











