పవన్ 'పంజా'సెన్సార్ టాక్ రూమరా
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'పంజా'రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. డిసెంబర్ 9న విడుదల అయ్యే ఈ సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి. ఈ చిత్రం చూసిన సెన్సార్ వారు చాలా పాజిటివ్ టాక్ చెప్పారని తెలుస్తోంది.మాస్ సినిమాకు కావాల్సిన మశాలాలు అన్నీ ఉన్నాయి అని సెన్సార్ చేసిన మెంబర్ వ్యాఖ్యానించారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా సెంటిమెంట్, రివేంజ్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాయని, అలాగే పాపారాయుడుగా బ్రహ్మానందం కామిడీ కూడా సెకండాఫ్ లో నచ్చిందని సెన్సార్ టాక్ గా చెప్పుకుంటున్నారు. అయితే సెన్సార్ టాక్ అనేది రూమర్ అని,అస్సలు సెన్సార్ చేసిన సెన్సార్ వారు బయిట ఎవరితోనూ ఈ విషయమై చర్చించలేదని, సినిమాపై హైప్ క్రియేట్ చేయటానికి ఇలా సెన్సార్ టాక్ అంటూ రూమర్స్ క్రియేట్ చేసున్నారని ఓ వర్గం మండిపడుతోంది. ఇక ఇప్పటికే విడుదల అయిన ఆడియో జనాదారణ పొందింది. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు కొత్తమ్మాయిలు మాజీ మిస్ ఇండియా సారా జేన్ డయాస్, ముంబై మోడల్ అంజలీ లావణియా కనిపించబోతున్నారు.
దీనికి తోడు దర్శకుడు విష్ణు వర్ధన్ తమిళంలో చేసిన చిత్రాలు అన్నీ మంచి స్టైలిష్ ఎంటర్టైనర్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఈ చిత్రం కూడా ఆ రేంజిలో ఉండి పవన్ కెరీర్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అలాగే పవన్ కూడా గడ్డంతో ఈ సినిమాలో డాన్ గా కొత్తగా కనిపించి ఆసక్తి రేపుతున్నాడు.


Click it and Unblock the Notifications











