అక్కడా తెలుగువాడికి అన్యాయమే...

By Staff

BN Reddy
బి.ఎన్‌.రెడ్డి శతజయంతి సంవత్సరం (16-11-1908) సందర్భంగా ఆయన పోస్టల్‌ స్టాంప్‌ వెలువరించే సన్నాహాలలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బి.ఎన్‌.నే కాకుండా సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరికీ ఇది నిజంగా సంతోషకరమైన వార్తే. అటితే ఇప్పటివరకూ 80మంది సినీ రంగ ప్రముఖుల ఫొటోలతో పోస్టల్‌ స్టాంపులు వెలువడ్డాయి. అయితే అందులో కేవలం తెలుగువారికి సంబంధించినవి నాలుగంటే నాలుగు కావడంచెప్పుకోతగ్గ విషయం.

సినిమావారంటే చాలామందికి చిన్న చూపు ఉన్న తరుణంలో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన బి.ఎన్‌.రెడ్డి తన చిత్రాల ద్వారా మేధావి వర్గాన్ని ఆకట్టుకున్నారు. అంతేగాక తెలుగులో తొలిసారిగా ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి కూడా కావటం విశెషం. ఇక ఆయన వాహినీ పతాకంపై రూపొందించిన 'స్వర్గసీమ', 'వందేమాతరం', 'మల్లీశ్వరి... వంటి చిత్రాలు తెలుగు సినిమాకి రిఫెరెన్స్ లు వంటివి.

బంగారు పంజరం చిత్రం బి.ఎన్.రెడ్డి గారి ఆఖరి చిత్రం. అందులో ఒక చోట హీరో ...హీరోయిన్ తో ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. ఆమె లోపల నుండి చీర కట్టుకుంటున్నాను అంటుంది. అయితే బి.ఎన్.రెడ్డిగారు ఈ సంభాషణను సెన్సార్ కు ముందే సినిమా నుంచి తొలిగించారు. విజువల్ గా ఈ సన్నివేశం లేదుగా అంటే ...ఆయన చీర కట్టుకుంటున్నాను అని చెబితే చూసే ప్రేక్షకులు ఆమె స్ధితిని మానసికంగా వేరే రకంగా ఊహించుకుంటారు.అది చాలా తప్పు అని విశ్లేషించారు. అందుకే ఆయన తీసిన 11 సినిమాల్లో ఒక్కటి కూడా సెన్సార్ కట్ కాలేదు.

తెలుగులో తొలిసారిగా చిత్రకధానాయకుడు, రంగస్థల ప్రముఖుడు అయిన బళ్లారి రాఘవ స్మత్యర్ధం 1981లో ఆయన ఫొటోతో ఈ తపాల బిళ్ల రూపొందింది. మళ్లీ 19 ఏళ్లకు 2000 సంవత్సరంలో ఎన్‌.టి.ఆర్‌. ఫొటోతో ఓ స్టాంప్‌ వెలువడింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు 2003లో అమరగాయకుడు ఘంటసాల గౌరవార్ధం తపాలబిళ్ల రూపొందింది. అలాగే 2006లో ఎల్‌.వి. ప్రసాద్‌ స్మృత్యర్ధం ఒక స్టాంపు వెలువడింది. సాధారణంగా ఎవరి చిత్రంతోనన్నా స్టాంప్‌ని వెలువరించాలంటే ఆయా ప్రముఖులు మరణించి పదేళ్లు పూర్తయి ఉండాలి.అంతే కాదు వాళ్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఉండాలి.

అయితే తమిళ, తెలుగు భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి పేరు తెచుకున్న నాగయ్య , అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా ఎన్నికయి , గొప్పనటుడుగా కీర్తించబడిన ఎస్‌.వి. రంగారావు, మహనటి సావిత్రి మరణించి పాతికేళ్లు కావస్తోంది. కానీ వారి ఫొటోలతో పోస్టల్‌ స్టాంపులు రాలేదు. అయితే, జెమినీ గణేశన్‌ మరణించిన పదకొండు నెలలకే పోస్టల్‌ స్టాంపు విడుదలైంది. అదీ విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X