పద్మాలయాలో ‘రాంబాబు’
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం తాజాగా పద్మలయా స్టూడియోలో షూటింగ్ జరురుపుకుంటోంది. ఇప్పటికే టాకీ పార్టు పూర్తి కాగా...ప్రస్తుతం ఇక్కడ రిమేనింగ్ సాంగుల చిత్రీకరణ జరుగుతోంది. దాదాపు మరో వారం రోజుల్లో పాటల చిత్రీకరణ పూర్తవుతుంది.
ఈ చిత్రంలో పవన్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పవర్ స్టార్ జర్నలిస్టుగా నటిస్తుండగా, తమన్నా గంగ పాత్ర చేస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 24న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 11న ఈచిత్రం విడుదల కానుంది.
పవర్ ఫుల్ సబ్జెక్ట్, ఎంటర్‌టైన్మెంట్, సూపర్ సాంగ్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నిశేశాలతో ప్రేక్షకులు, పవన్ అభిమానులు అందరూ మెచ్చే విధంగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' రూపొందుతోంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. పూరి జగన్నాథ్ పవర్ స్టార్ కోసం రాసిన సూపర్ డైలాగలకు థియేటర్లు చప్పట్లతో దద్దరిల్లనున్నాయి.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











