మహేష్‌తో ఉన్నంత చనువు ఉండదు: పవన్ ఫ్యాన్స్

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఆడియో రేపు(సెప్టెంబర్ 26) నేరుగా విడుదల కానుంది. అయితే ఫంక్షన్ లేపోయినా అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఈ మధ్య ఆడియో ఫంక్షన్ రోటీన్ అయిపోయాయి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజీ ఓ పోస్టు చేసింది.

''ఈ మధ్య ఏ ఆడియో ఫంక్షన్ చూసినా ఒకే విధంగా వుంటున్నాయి. పొగడ్తలు .. పొగడ్తలు .. పొగడ్తలు .. పొగడ్తలు .. హీరో ను పొగడక పొతే ఫ్యాన్స్ గెస్ట్ లను మాట్లాడానిక పోవడం. ఫ్యాన్స్ ను ఏమి అనలేక వాళ్ళ చేష్టలను అతిధులు భారంగా భరించడం. ఆ విధంగా ఆలోచిస్తే 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఆడియో ఫంక్షన్ అవసరమా అనిపిస్తుంది. ' ఆడియో ఫంక్షన్ వలన సినిమాకు మంచి పబ్లిసిటి కాబట్టి, సినిమాకు ఆడియో ఫంక్షన్ చాలా అవసరం. సినిమాపై హిరో మనసులోని మాటలు వినవచ్చు '... కాని ఈ ప్రోసస్ అంతా రొటీన్ అయిపోయింది. బిజెనెస్ మెన్ ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాథ్ మహేష్ బాబు ను ర్యాగింగ్ చేసినట్టు, పవన్ కళ్యాణ్ ను కూడా పూరి జగన్నాథ్ ప్రశ్నలతో ముంచెత్తి పవన్ కళ్యాణ్ పై తెలుగు ప్రేక్షకులకు వున్న డౌట్స్ అన్ని తీరిస్తే బాగుండును. కానీ మహేష్ బాబుతో ఉన్నంత చనువు పవన్ కళ్యాణ్ తో వుండి వుండదు.'' అంటూ ఆడియో ఫంక్షన్ లేక పోవడాన్ని కొందరు పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వెబ్ పేజీలో సమర్థించుకుంటున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి, గుడుంబా శంకర్, బాలు, తీన్ మార్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన మణి శర్మ...ఈ చిత్రానికి పూరి టేస్టుకు తగిన విధంగా మాంచి మాస్ బీట్స్ తో సాంగ్స్ కంపోజ్ చేసారు. ఇటు పవన్ కళ్యాణ్ స్టైల్‌కు సరిపోయే విధంగా, అటు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌కు అద్దం పట్టేలా ఆయన మ్యూజిక్ ఉంటుందని అంటున్నారు.

ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాన్‌కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. అమ్మడు అందాల ప్రదర్శనపై కూడా ఈచిత్రంలో బాగా ఫోకస్ చేసారని సమాచారం.

ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్. అక్టోబర్ 18న చిత్రం విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X