పవన్ ఎఫెక్ట్: నాగ్ ‘డమరుకం’ మళ్లీ వాయిదా
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, అనుష్క జంటగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'డమరుకం' చిత్రం ఈ నెల 20 విడుదల చేసేందుకు సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదల చివరి నిమిషయంలో మరోసారి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం విడుదలైన నేపథ్యంలో 'డమరుకం' విడుదల చేయడానికి నిర్మాతలు సాహసించడం లేదని, పవర్ స్టార్ సినిమాతో పోటీ పడితే 'డమరుకం' ఓపెనింగ్స్ దెబ్బతింటాయనే కారణంతోనే మరోసారి విడుదల వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ....దర్శకుడు శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి అందరు టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారు. సినిమాలో లాస్ట్ 35 నిమిషాలు గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాల రేంజిలో ఉంటాయి. కేలం గ్రాఫిక్స్ వల్లనే సినిమా ఆడుతుందని నేను అనను. కథకు తగిన విధంగా గ్రాఫిక్స్ చాలా భాగా సూటయ్యాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు నాగార్జున.
నాగార్జున, అనుష్క నటిస్తున్న డమరుకం చిత్రంలో ప్రకాష్ రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ్భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.


Click it and Unblock the Notifications











