అరవింద్ గుప్పిల్లోకి పవన్ సినిమా!(పక్కా వ్యూహం)

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈచిత్రం నైజాం థియేట్రికల్ రైట్స్ అల్లు అరవింద్‌కు సంబంధించిన గీతా ఆర్ట్స్ సంస్థ దక్కించుకుంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం పక్కా అగ్రి మెంట్ ప్రకారం దీని హక్కులు సొంతం చేసుకుందని, ఎన్ఆర్ఏ(నాట్ రీ ఫండబుల్ అడ్వాన్స్) ఒప్పందం కుదిరందని తెలుస్తోంది. ఇందుకోసం అల్లు అరవింద్ భారీ మొత్తంలో చెల్లించినట్లు తెలుస్తోంది. పవన్ గత సినిమా 'గబ్బర్ సింగ్' నైజాం ఏరియాలో రూ. 20 కోట్ల వసూలు చేయడంతో అరవింద్ వ్యూహాత్మకంగా ఈ చిత్రం హక్కులను దక్కించుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. పవన్ కళ్యాణ్, తమన్నాలపై పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు 22న ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది. పవన్ ఇందులో మెకానిక్‌‍గా నటిస్తుండగా, తమన్నా జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది.

దర్శకుడు పూరి జగన్నాథ్ శర వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వెలుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయాలనే కమిట్‌మెంట్‌తో ఉన్నాడు. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X