twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమన్నాతో బీర్, మరొకరితో గుట్కా.... ఇదేం సంస్కృతి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : 2011 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు ఎన్. శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై మండి పడుతున్నారు. ఈ చిత్రాన్ని తెలంగాణ ఉద్యమంపై సెటైర్ గా, ఇక్కడి ప్రజల మనో భావాలను దెబ్బతీసేలా తీసారని ఆరోపించడంతో పాటు.....ఈ చిత్రంలో మహిళలను కూడా బ్యాడ్ గా చూపించారని శంకర్ ఆరోపిస్తున్నారు.

    ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన ముగ్గురు మహిళలను బ్యాడ్ గా చూపించారని, హీరోయిన్ తమన్నాకు బీర్ తాగే అలవాటు ఉన్నట్లుగా చూపించారని, ఉమెన్ పొలిటీషియన్ గుండక్కను గుట్కా అలవాటు ఉన్న మహిళగా చూపించారని, టీవీ ఛానల్ హెడ్ స్కార్లెట్ విలన్స్ తుపాకి పట్టుకుని హీరోను షూట్ చేసే వ్యక్తిగా చూపించారని చెప్పారు.

    మన దగ్గర మదర్ థెరిస్సా, మేధా పాట్కర్ లాంటి గొప్ప వారు ఉన్నారు....అలాంటి వారిని ఆదర్శంగా మహిళను చూస్తే గౌరవంగా ఉంటుందని, ఇలా చూపడం మహిళల క్యారెక్టర్ ను అవమానించడమే అంటున్నారు శంకర్. అయితే శంకర్ తీరును మాత్రం పవన్ అభిమానులు తప్పు పడుతున్నారు. సినిమాను సినిమాలా చూడాలని, ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో ఉన్నవే అని, తెలంగాణ ప్రాంతానికి చెందిన కథాంశంతో వచ్చిన సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

    పవన్ కళ్యాణ్-తమన్నా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదలైన రికార్డు కలెక్షన్లతో దూసుకెలుతోంది. తెలంగాణ గొడవతో రెండో రోజు కాస్త ఇబ్బంది కర పరిస్థితి నెలకొన్నా...కొన్ని అభ్యంతరకర సీన్లు తొలగించి సినిమాను ప్రదర్శిస్తున్నారు.

    English summary
    Year 2011's Nandi Award director N Shankar has opined that 'Cameraman Ganga Tho Rambabu' portrays women in a bad light.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X