»   » పవన్ ‘రాంబాబు’కు బుల్లితెరపై ఊహించని రేటు!

పవన్ ‘రాంబాబు’కు బుల్లితెరపై ఊహించని రేటు!

By Bojja kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాలీవుడ్ జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా ప్లాపైనా, హిట్టయినా పవన్ రేంజి ఒకే విధంగా కొనసాగుతూ వస్తోంది. పవన్ అంటే అంత అభిమానం మరి. అంత డిమాండ్ ఉండబట్టే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి ఊహించని రేటు చెల్లించి సొంతం చేసుకుంది ప్రముఖ టీవీ ఛానల్.

    'రాంబాబు' సినిమాపై తెలంగాణ ప్రాంతంలో వివాదం నెలకొనడం, సినిమాలోని కొన్ని అభ్యంతరకర సీన్లకు ప్రభుత్వం వేసి కమిటీ కత్తెర పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సాటిలైట్ రైట్స్ పెద్దగా రావని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా జెమినీ టీవీ వారు ఈచిత్రానికి రూ. 6.7 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

    గతంలో ఇదే ఛానల్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రానికి రూ. 6 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. గబ్బర్ సింగ్ చిత్రంతో పోలిస్తే 'రాంబాబు' ఏమంత పెద్ద హిట్టు కాక పోయినా రేటు మాత్రం అధికంగా రావడం గమనార్హం. ఈ రేటు పవన్ సినిమాల్లోకెల్లా హయ్యెస్ట్ రేటు.

    కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. పవన్ సరసన తమన్నా హీరోయిన్. పవన్ ఈచిత్రంలో టీవీ చానల్ జర్నలిస్టు రాంబాబు పాత్ర పోషించగా.... తమన్నా కెమెరామెన్ గంగ పాత్రలో నటించింది. యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు.

    English summary
    The Satellite rights of the ‘Camera Man Gangatho Rambabu’ have been picked up for a very fancy price of around Rs.6.7 Crores by Gemini TV. Earlier the same channel picked up Gabbar Singh satellite rights for Rs.6 crore.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more