‘కెమెరామెన్ గంగతో...’ తమిళ్ రైట్స్ ఎంత?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' అక్టోబర్ 11న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ వేగవంతంగా సాగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం తమిళనాడు రైట్స్ అమ్ముడయినట్లు స్పష్టం తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్లు రూ. 55 లక్షలకు అమ్ముడు పోయినట్లు సమాచారం. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో అక్కడ విడుదలైన పవర్ స్టార్ చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి.
యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే ఈ చిత్రంలో పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఫైనల్ గా సెప్టెంబర్ 24న ఖరారు చేసారు. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు.
అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాన్‌కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. అమ్మడు అందాల ప్రదర్శనపై కూడా ఈచిత్రంలో బాగా ఫోకస్ చేసారని సమాచారం. ఇటు పవన్ కళ్యాణ్ స్టైల్‌కు సరిపోయే విధంగా, అటు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌కు అద్దం పట్టేలా మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











