'కెమెరామేన్ గంగతో...' ఫస్ట్ లుక్, టీజర్ విడుదల తేదీ
పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్,టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల తేదీ అని ఇప్పటికే పూరి ప్రకటించి ఉన్నారు. ఆ రోజే పవన్ అభిమానులు పండగ చేసుకోనున్నారు.
ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సారధీ స్టూడియోలో భారి సెట్ లో జరుగుతోంది. రాత్రిళ్ళు ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు రాత్రిళ్లు అయినా సారధి స్టూడియోను వదలటం లేదు. అక్కడ వివరీతంగా క్రౌడ్ ఉంటున్నారు. పోలీసులు సాయింతో కంట్రోలు చేసి షూటింగ్ కొనసాగిస్తున్నారు. అలాగే సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు.
తొలి కలయిక 'బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. 'బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. 'గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.
ఇందులో పవర్‌స్టార్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. ఇక ఈ చిత్రంలో విలన్ గా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు
బ్యానర్: యూనివర్సల్ మీడియా
నటీనటులు: పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











