కెమెరామెన్ గంగతో...ఒక్కరోజే 4లక్షల మంది!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఆడియో నిన్న విడుదల కాగా...శ్రోతల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మరో వైపు నిన్న విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్‌ను ఒక్కరోజే ఆన్ లైన్లో 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని, గతంలో గబ్బర్ సింగ్ ట్రైలర్‌కు రికార్డ్ స్థాయి హిట్స్ రాగా...ఇప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు ట్రైలర్ దాన్ని అధిగమించిందని...మెగా ఫ్యామిలీ పబ్లిసిస్ట్, నిర్మాత ఎస్‌కెఎన్ శ్రీనివాస్ వెల్లడించారు. పూరి-మణి కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి', 'చిరుత' వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత వచ్చిన మరో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అవుతుందని అంటున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ...ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ అద్భుతంగా వచ్చాయని, మా బ్యానర్‌లో, పవర్‌స్టార్ కెరీర్‌లో ఇది ఓ బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుందిపూరి జగన్నాథ్‌గారు పవర్‌స్టార్ కోసం రాసిన సూపర్ డైలాగ్స్‌కు థియేటర్ చప్పట్లతో దద్దరిల్లుతుంది. ఏకధాటిగా సింగిల్ షెడ్యూల్‌లో ఇంత భారీ చిత్రాన్ని పూర్తి చేయగలిగామంటే పూరిగారి ప్లానింగ్, పవన్‌కళ్యాణ్‌గారి హార్డ్‌వర్క్ ప్రధాన కారణాలు. వారి కాంబినేషన్‌లో ఇంత పెద్ద సెన్సేషనల్ ఫిలిం తీస్తున్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా వుంది' అని అన్నారు. మణిశర్మ ఈచిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీగా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమా అన్ని వర్గాల వారిని ఎంటర్‌టైన్ చేస్తుంది. అక్టోబర్ 18న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం, సినిమా మా అంచనాలను అందుకుంటుందనే ధీమా వ్యక్తం చేసారు.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











