బన్నీ వాసు చేతికి ‘రాంబాబు’ రైట్స్

By Bojja Kumar

హైదరాబాద్: గబ్బర్ సింగ్ చిత్రాన్ని వెస్ట్ గోదావరిలో విజయవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు.... తాజాగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' వెస్ట్ గోదావరి రైట్స్ కూడా దక్కించుకున్నారు. భారీ అమౌంట్ చెల్లించి ఈ చిత్రం హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్‌కు చాలా క్లోజ్ అయిన బన్నీ వాసు 100%లవ్ చిత్రంతో నిర్మాతగా మారాడు. విజయవంతమైన డిస్ట్రిబ్యూటర్‌గా పేరున్న బన్నీ వాసు చేతికి ఈచిత్రం హక్కులు దక్కడంపై వెస్ట్ గోదావరి జిల్లా మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ వాసు ఆర్య చిత్రంతో వెస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు. ఆ చిత్రాన్ని విజయవంతంగా పంపిణీ చేయడంతో మెగా కుటుంబానికి నమ్మకస్తుడైన డిస్ట్రిబ్యూటర్ గా మారాడు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ కు దగ్గరయ్యాడు. అప్పటి నుంచి మెగా కుటుంబ హీరోల సినిమాలన్నీ బన్నీ వాసుకు రిజర్వ్ చేయబడుతున్నాయి.

కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర విశేషాల్లోకి వస్తే.... అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సినిమాలో. పవర్ స్టార్ పెర్ ఫార్మెన్స్ హైలెట్‌గా పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్మెంట్, సూపర్ సాంగ్స్‌తో, థ్రిల్లింగ్ యాక్షన్‌తో ప్రేక్షకులు, పవన్ అభిమానులు అందరూ మెచ్చే విధంగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' రూపొందుతోంది.

పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X