»   » ఛ...టూ మచ్ అంటూ మంచు లక్ష్మిపై రానా

ఛ...టూ మచ్ అంటూ మంచు లక్ష్మిపై రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి మోడీని కలిసిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ పెళ్లికి మోడీని ఆహ్వానించేందుకు వారు వెళ్లారు. మంచు లక్ష్మి మోడీతో కలిసి కొన్ని సెల్ఫీ ఫోటోలు కూడా దిగింది. వాటిని తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పోస్టు చేసింది.

ఈ వ్యవహారంపై మంచు లక్ష్మి ఫ్రెండ్, తెలుగు సినీ నటుడు రానా స్పందిస్తూ.....ఇది చాలా టూ మ్ అంటూ కామెంట్ చేసారు. అసలు రానా ఏ ఉద్దేశ్యంతో ఈ కామెంట్ చేసారో అర్థం కాలేదు. రానా వ్యాఖ్యలకు మంచు లక్ష్మి రిప్లై ఇస్తూ అది టూమచ్ కాదు రానా గారూ... ఇట్స్ హేపియెస్ట్ మూమెంట్స్, ప్రైస్ లెస్... :) అంటూ సమాధానం ఇచ్చింది.

ఇటీవలే మనోజ్ నిశ్చితార్థం ప్రణతి రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 4, ఉదయం 10.30 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగింది. మనోజ్-ప్రణతి వివాహానికి పురోహితులు మే 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. మరో విశేషం ఏంటంటే మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే. ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.

Cha too much.....@LakshmiManchu

కాబోయే కోడలి గురించి మోహన్ బాబు స్వయంగా వెల్లడించారు ''మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి ఇద్దరూ క్లాస్ మెట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులకూ, మా కుటుంబానికీ పరిచయం ఏర్పడింది. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్ లో సీపీఎ (అమెరికాలో చార్టెడ్ ఎకౌంట్ ని సిపీఎ అంటారు) చేసింది. రెండు రోజుల క్రితం ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలను కలిసి వివాహ విషయం మాట్లాడాం. మీ అందరి ఆశీస్సులతో ఈ పెళ్లి జరుగుతుంది'' అని చెప్పారు.

English summary
"Cha too much.....LakshmiManchu" Rana tweeted about Narendra Modi-Lakshmi Manchu meeting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu