Chaari 111 Trailer Review హీరోవి కాదు కమెడియన్‌వే.. వెన్నెల కిషోర్‌కు హీరోయిన్ పంచ్.. జేమ్స్ బాండ్‌ రేంజ్‌లో

కమెడియన్లు హీరోగా మారడం తెలుగు సినిమా పరిశ్రమలో సాధారణంగా కనిపిస్తుంటాయి. అప్పట్లో రాజబాబు నుంచి నేటి బ్రహ్మనందం, సునీల్, సప్తగిరి లాంటి హీరోలుగా కూడా మెప్పించారు. తాజాగా టాలీవుడ్‌లో టాప్ కమెడియన్లలో ఒకరైన వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న సినిమా ట్రైలర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమా గురించి.. ట్రైలర్ గురించిన వివరాల్లోకి వెళితే..

బర్కత్ స్టూడియో బ్యానర్‌పై టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో అదితి సోని నిర్మాతగా టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చిత్రం చారీ 111. ఈ చిత్రంలో మురళీశర్మ కీలక పాత్రలో, హీరోయిన్‌గా సంయుక్త మీనన్ తదితరులు నటించారు. ఈ సినిమా స్పై, యాక్షన్, కామెడీ జోనర్‌లో రూపొందింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య వార్ నేపథ్యంగా అల్లిన వినోదాత్మక చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తొలి చూపులోనే ఆకట్టుకొన్నది.

 Chaari 111 Telugu Movie Trailer Review: Vennela Kishore Looks Hillarious and Rocks as Secret Agent

ఇక చారీ 111 సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. 1992లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో కెమికల్, బయోలాజికల్ ఆయుధాలు తయారు చేయకూడదనే పాయింట్‌తో ట్రైలర్‌ను ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారనిపిస్తుంది. ఆ తర్వాత ఓ సీక్రెట్ ఏజెన్సీకి ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేయాలని అనుకోవడం, ఏజెంట్ చారీకి ఆఫర్ ఇవ్వడంతో వెన్నెల కిషోర్ ఎంట్రీ హిలేరియస్‌గా కనిపించింది.

సైలెంట్‌గా ముగించాల్సిన విషయాన్ని వైలెంట్‌గా ముగిస్తాడని ఇంట్రడక్షన్ ఇస్తే.. చారీ.. బ్రహ్మచారి అంటూ జేమ్స్ బాండ్ లెవెల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇండియాలో సీరియల్ బ్లాస్టింగ్స్, సైకో సైంటిస్ట్ అంశాలతో ఆసక్తికరంగా కనిపించింది. ఇక నీవు ఎప్పటికీ ఈ జన్మకు ఏజెంట్‌వి కావు రాసిపెట్టుకో అంటూ మురళీ శర్మ అనడం.. అలాగే నీవు హీరోవి కావు.. కమెడియన్‌వి అని హీరోయిన్ అంటే.. తొక్కేమీ కాదు అంటూ వెన్నెల కిషోర్ పంచ్ విసరడం ట్రైలర్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించింది. హ్యాస్య ప్రియులు, స్పై జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి చారీ 111 ఫుల్ మీల్స్‌లా ఉంటుందనే ఫీలింగ్‌ను క్రియేట్ చేసింది.

నటీనటులు: వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ తదితరులు
నిర్మాత: అదితి సోనీ
రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్
ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్ ఎ
స్టంట్స్: కరుణాకర్
ప్రొడక్షన్ డిజైన్: అక్షత బి హొసూరు
పీఆర్వో: పులగం చిన్నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలు కొమిరి
సాహిత్యం: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్
మ్యూజిక్: సైమన్ కె కింగ్
బ్యానర్: బర్కత్ స్టూడియోస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X